దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 17వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విధించిన లాక్డౌన్ మే 3న ముగియనుండగా.. విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం మరో రెండు వారాలు పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈ లాక్డౌన్లో ఏఏ వాహనాల రవాణాకు అనుమతి ఉంటుంది? వేటికి ఉండదు? ఎలాంటి షాపులను తెరిచి ఉంచొచ్చు అన్న వివరాలు గమినిస్తే...
లాక్డౌన్లో అనుమతి లేనివి..
- పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, క్రీడా ప్రాంగణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, సాంస్కృతిక కేంద్రాలు మూసివేసే ఉంటాయి.
- మతపరమైన కేంద్రాలు తెరుచుకోవు
- అత్యవసరం కాని పనులకు రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు అనుమతి లేదు
- 65ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్ల పిల్లలు, గర్భిణీలు ఇళ్లలోనే ఉండాలి
- రెడ్ జోన్లలో సైకిళ్లు, ఆటో రిక్షాలు, క్యాబ్‌లు, ట్యాక్సీలకు అనుమతి ఉండదు
- సెలూన్లకు కూడా అనుమతి లేదు
- అంతర్ జిల్లా బస్సు సర్వీసులకు అనుమతి ఉండదు
వీటికి అనుమతి
- గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వ్యవసాయ పనులకు అనుమతి ఉంటుంది
- రెడ్జోన్లలో ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ సేవలు, డేటా కాల్ సెంటర్లకు అనుమతి
- ఆరెంజ్ జోన్లలో ట్యాక్సీ సేవలకు డ్రైవర్, ఒక సహాయకుడి సాయంతో అనుమతి
- గ్రీన్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడి
- గ్రీన్ జోన్లలో 50శాతం ప్రయాణికులతో బస్సులకు అనుమతి
పెళ్లికి 50 మంది.. అంత్యక్రియలకు 20
- బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి, భౌతికదూరం పాటించాలి
- బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి కంటే మించి ఉండరాదు
- వివాహాల వంటి శుభకార్యాలకు 50 కంటే ఎక్కువ మందికి అనుమతి ఉండదు
- అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20 కంటే ఎక్కువ మందికి అనుమతి ఉండదు
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా వేయాలని ఆదేశం
- బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, గుట్కా, పొగాకు నమలడం నిషేధం