ETV Bharat / bharat

మరో వ్యాక్సిన్‌ను పరీక్షిస్తున్న భారత శాస్త్రవేత్తలు - corona vaccine tests

కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు భారత్​ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు వ్యాక్సిన్లను పరీక్షించిన సీఎస్​ఐఆర్..​ మరో ప్రయత్నం చేపట్టింది. కుష్ఠు వ్యాధిపై సమర్థంగా పనిచేస్తున్న వ్యాక్సిన్​.. కరోనాపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తోంది.

coronavirus-india-testing-multi-purpose-vaccine-in-fight-against-covid-19
మరో వ్యాక్సిన్‌ను పరీక్షిస్తున్న భారత శాస్త్రవేత్తలు
author img

By

Published : Apr 18, 2020, 6:34 AM IST

Updated : Apr 18, 2020, 6:48 AM IST

కరోనాను కట్టడి చేసేందుకు భారతీయ శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కుష్ఠు వ్యాధి(లెప్రసీ)పై సమర్థంగా పనిచేసిన బహుళ ప్రయోజనాలున్న వ్యాక్సిన్‌.. కొవిడ్‌-19పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పరీక్షిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే గుణమున్న ఈ వ్యాక్సిన్‌.. మహమ్మారిపై ఎలా పోరాడుతుందో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు సీఎస్‌ఐఆర్‌ తెలిపింది.

"డీసీజీఐ ఆమోదంతో లెప్రసీకి ఉపయోగించే ఎండబ్ల్యూ వ్యాక్సిన్‌ను మేం పరీక్షిస్తున్నాం. కొత్త వ్యాక్సిన్‌ను తయారు చేయడం సుదీర్ఘ ప్రక్రియ. ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే వ్యాక్సిన్‌ కోసం మేం కృషి చేస్తున్నాం. మరో రెండు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం. రాగానే ట్రయల్స్‌ మొదలుపెడతాం. ఆరు వారాల్లోనే ఫలితాలు తెలుస్తాయి" అని సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శేఖర్‌ మండె అన్నారు.

వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్స్‌పై.. భారత్‌ పరిశోధనలు చేస్తోందని డాక్టర్‌ శేఖర్​ వెల్లడించారు. వైరస్‌ పుట్టుక, వ్యాప్తి నియంత్రణపై సమాచారం కోసం కీలకంగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు వినియోగంలో ఉన్న ఔషధాలతో వ్యాధిని నిరోధించగలమా? వైరస్​పై ఎంతమేరకు దాడి చేయగం? అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

"పుణెలోని వైరాలజీ కేంద్రం (ఎన్‌ఐవీ) 25 సీక్వెన్స్‌లు రూపొందించింది. మాకున్న రెండు ప్రయోగశాలల్లో మేం 30 సీక్వెన్స్‌లు చేశాం. వచ్చే రెండు వారాల్లో 500-1000 చేయగలం. ప్రస్తుతం ప్రపంచంలో ఆరు నుంచి ఏడు రకాల కరోనా స్ట్రెయిన్స్‌ ఉన్నాయి. భారత్‌లో ఎన్ని ఉన్నాయో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. ఎక్కువ సీక్వెన్స్‌లు చేసేకొద్దీ వివరాలు తెలుస్తాయి" అని డాక్టర్‌ మండె వెల్లడించారు.

అమెరికాతో కలిసే పోరాటం..

కరోనా వైరస్‌పై పోరులో భారత్‌తో కలిసి పనిచేస్తామని అమెరికా మరోసారి స్పష్టంచేసింది. వైద్య విధానం, వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఇరు దేశాలు సహకరించుకుంటాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిముఖ్యమైన సమస్యలపై చర్చలతోపాటు.. సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై ఇరుదేశాల మధ్య సహకారం కొనసాగుతుందని తెలిపారు. వ్యక్తిగత పరిరక్షణ పరికరాలతో పాటు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వంటి వాటికి అవరోధం లేదని పాంపియో విలేకరులతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఇరు దేశాల జాతీయ భద్రతకు సంబంధించిన ప్రాధాన్యత అవసరాల సరఫరాపై దృష్టి సారించామన్నారు.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ వేళ వైభవంగా మాజీ సీఎం కుమారుడి వివాహం!

Last Updated : Apr 18, 2020, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.