ETV Bharat / bharat

కరోనాకు గుజరాత్​లో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు బలి - గుజరాత్​ కేసుల సంఖ్య

దేశంలో కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్​లో మరో మరణం సంభవించింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 43 మంది వైరస్​ బారిన పడ్డారు. కర్ణాటకలోనూ ఓ మహిళ మృతి చెందింది.

Coronavirus: Gujarat reports third death
గుజరాత్​లో మూడుకు చేరిన కరోనా మరణాలు
author img

By

Published : Mar 26, 2020, 3:41 PM IST

దేశంలో కరోనా వైరస్​ క్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహమ్మారికి ధాటికి గుజరాత్​లో 70 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. అతడితో కలిపి మొత్తం ముగ్గురు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో మరో నలుగురు వైరస్ బారిన పడగా... మొత్తం కేసుల సంఖ్య 43కు చేరింది.

గుజరాత్​ వ్యాప్తంగా 19,567 మంది గృహ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు అధికారులు.

కర్ణాటకలో...

కర్ణాటకలో మరో మహిళ మరణించినట్లు ప్రకటించారు అధికారులు. ఆమె ఇటివలే సౌదీ అరేబియా నుంచి వచ్చినట్లు వెల్లడించారు.

కర్ణాటకలో ఇప్పటికే కరోనా​ కారణంగా ఒకరు మరణించారు. 41 మందికి వైరస్ సోకగా.. ముగ్గురు కోలుకున్నారు.​

ఇదీ చూడండి:మోదీజీ... ఆ విషయంలో నా పూర్తి మద్దతు: సోనియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.