దిల్లీలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక శిబిరం నుంచి వ్యాధి లక్షణాలు లేని కారణంగా 200మందిని డిశ్ఛార్జీ చేశారు. ఇటీవల కరోనా వైరస్ భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నేపథ్యంలో వైరస్ కేంద్రస్థానమైన చైనా వుహాన్ నుంచి వెనక్కి వచ్చిన 650 మందిలో 406 మందిని ఐటీబీపీ దళాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ 4వందలమందికీ వ్యాధి సోకలేదని.. తొలి విడతగా 2వందల మందిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.
"కరోనా వైరస్‌కు సంబంధించి 406మందికి సంబంధించిన తుది నివేదికల్లో వ్యాధి లక్షణాలు లేనట్లుగా నిర్ధరణ అయింది. తొలి బ్యాచ్‌లో 2వందలమందిని విడుదల చేస్తున్నాం. మిగిలిన వారిని మంగళవారం విడుదల చేస్తాం."
-వివేక్‌కుమార్, ఐటీబీపీ అధికార ప్రతినిధి
వైరస్ లేదని నిర్ధరణ అయిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి ప్రత్యేక శిబిరాన్ని సందర్శించారు. శిబిరంలోని వారితో సంభాషించారు. అనంతరం వైద్య సేవలపై అధికారులతో సమీక్షించారు.
ఇదీ చూడండి: భారత్‌లో ప్రవేశించకుండా అడ్డుకున్నారు: బ్రిటన్ ఎంపీ