ETV Bharat / bharat

దేశంలో 500 దాటిన కరోనా కేసులు.. 'మహా'లో విజృంభణ

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 519 కేసులు నమోదవ్వగా తొమ్మిది మంది మరణించారు. 40 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మహారాష్ట్రలో అత్యధికంగా 107 కేసులు నమోదయ్యాయి.

Coronavirus cases in India rise to 519
దేశంలో 519కి చేరిన కరోనా కేసులు
author img

By

Published : Mar 24, 2020, 9:16 PM IST

ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​ భారత్​లోనూ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 519కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 43మంది విదేశీయులు. మహమ్మారి నుంచి 40 మంది కోలుకున్నట్లు తెలిపారు అధికారులు. ప్రస్తుతం 470 యాక్టివ్​ కేసులున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 24 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వైరస్​ వ్యాప్తి చెందినట్లు ప్రకటించింది.

మహారాష్ట్రలో...

మహారాష్ట్రలో మరో 12 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర అధికారుల వెల్లడించారు. మొత్తం 107 మందికి మహమ్మారి సోకినట్లు తెలిపారు. వారిని ముంబయిలోని నిర్బంధ కేంద్రానికి తరలించారు అధికారులు.

కేరళలో...

కేరళలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 14 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. దీంతో మొత్తం 105 మందికి కరోనా పాటిజివ్​గా తేలినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 72,460 మందిని వైద్య పరిశీలనలో ఉంచగా... మరో 467 మంది ఐసోలేషన్​ వార్డులో చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కర్ణాటకలో..

కర్ణాటకలో ఇప్పటి వరకు 41 కేసులు నమోదవ్వగా... ఓ వ్యక్తి మరణించినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ముగ్గురు డిశ్చార్జి అయినట్లు తెలిపారు.

దిల్లీలో కరోనా పోయిందా..?

దేశ రాజధాని దిల్లీలో గడిచిన 40 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. మొత్తం 30 మందికి వైరస్​ సోకగా ఇప్పటివరకు ఏడుగురు కోలుకున్నట్లు తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్​లో...

ఉత్తర్​ప్రదేశ్​లో ఇవాళ మరో ఇద్దరికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 37కు చేరింది. వీరిలో 11 మంది మహమ్మారి నుంచి కోలుకుని నిర్బంధ కేంద్రం నుంచి డిశ్చార్జి​ అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • మధ్యప్రదేశ్​లో కొత్తగా ఒక కేసు నమోదైనట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 మందికి మహమ్మారి సోకినట్లు స్పష్టం చేశారు.
  • తమిళనాడులో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్​గా వచ్చినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 15 మంది వైరస్​ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు.
  • పంజాబ్​లో మరో 6 కేసులు నిర్ధరణ అయ్యాయి. దీంతో మొత్తం 29 మందికి వైరస్​ సోకింది.
  • కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్​లో మరో ఇద్దరికి వైరస్ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది. కశ్మీర్​ లోయలో 67 ఏళ్ల మహిళ వైరస్​ నుంచి కోలుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

గుజరాత్​లో 33 ( ఒక విదేశీయుడు), రాజస్థాన్​లో 32 (ఇద్దరు విదేశీయులు), హరియాణాలో 28 (14 విదేశీయులు), లద్దాఖ్​లో 13, బంగాల్​లో 9, ఆంధ్రప్రదేశ్​లో 8, చండీగఢ్​లో 7, ఉత్తరాఖండ్​లో 4 ( ఒక విదేశీయుడు), హిమాచల్​ ప్రదేశ్​లో 3, బిహార్​లో 3, ఒడిశాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. పుదుచ్చేరి, మణిపుర్​, ఛత్తీస్​గఢ్​లో ఒక కేసు చొప్పున నమోదైనట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి.

ఇదీ చూడండి:కాంట్రాక్ట్​ ఉద్యోగులకు పూర్తి జీతం చెల్లిస్తాం: రైల్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.