కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో దేశంలోని 30 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 548 జిల్లాల్లో పూర్తిగా లాక్డౌన్ విధించారు. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది.
ఆదివారం వరకు దేశంలోని 80 జిల్లాల్లోనే లాక్డౌన్ విధించగా.. తాజాగా ఆ జాబితాను విస్తరించింది ప్రభుత్వం. భారత్‌లో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుండగా 23 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి దిగ్బంధం ప్రకటించింది. మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని 58 జిల్లాల్లో మాత్రమే లాక్డౌన్ విధించారు. మరో కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పాక్షికంగా సేవలు నిలిపి వేశారు. సిక్కిం, మిజోరం రాష్ట్రాల్లో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇదీ చూడండి: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చౌహానే ఎందుకంటే?