ETV Bharat / bharat

కరోనా రోగుల్లో రుచి, వాసన సామర్థ్యం తగ్గేది అందుకే!

కరోనా వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థపైనా ప్రభావం చూపుతోందని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని వల్లనే వాసన, రుచి చూసే సామర్థ్యాన్ని రోగులు కోల్పోతున్నారని తేల్చారు.

corona
కరోనా
author img

By

Published : Apr 27, 2020, 6:36 AM IST

Updated : Apr 27, 2020, 7:00 AM IST

కేంద్ర నాడీ వ్యవస్థపైనా కరోనా వైరస్ ప్రభావం చూపిస్తోందని జోధ్​పుర్​ ఐఐటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్‌ ‘హ్యూమన్‌ యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌-2’ (హెచ్‌ఏసీఈ) అనే నిర్దిష్ట రెసెప్టార్‌తో సంధానమవుతున్నట్లు ఇప్పటికే తేలిందని పరిశోధనకు నాయకత్వం వహించిన సుర్జిత్‌ ఘోష్‌ చెప్పారు.

"ఇవి మానవ శరీరంలోకి ప్రవేశించడానికి ప్రవేశద్వారాలుగా వైరస్‌కు ఉపయోగపడుతున్నాయి. ఈ రెసెప్టార్లు అనేక అవయవాల్లో ఉన్నాయి. మెదడు కూడా వీటిని కలిగి ఉంటుంది. తొలుత ఈ వైరస్‌ నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తోంది.

ఆ తర్వాత ముక్కులో వాసనకు సంబంధించిన కణజాలాల (ఆల్‌ఫ్యాక్టరీ మ్యూకోసా) నాడీ కణాలను ఉపయోగించుకొని ఆల్‌ఫ్యాక్టరీ బల్బు వరకూ వైరస్‌ వ్యాపిస్తుంది. ఈ ఆల్‌ఫ్యాక్టరీ బల్బు అనేది మెదడు ముందు భాగంలో ఉంటుంది. వాసన, రుచి చూసే సామర్థ్యాలకు ఇదే ప్రధాన కారణం."

- సుర్జిత్ ఘోష్, శాస్త్రవేత్త

కొవిడ్‌-19 సోకినప్పటికీ ఆ వ్యాధి లక్షణాలు బయటపడనివారిలో రుచి, వాసన చూసే సామర్థ్యం తగ్గుతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ లక్షణాల ఆధారంగా వారు స్వీయ క్వారంటైన్‌కు వెళ్లాల్సిన ఆవశ్యకతను ఈ పరిశోధన తెలియజేస్తోందన్నారు. అలాగే కేంద్ర నాడీ వ్యవస్థ కూడా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతోందనడానికి ఇది సంకేతమని తెలిపారు. కొవిడ్‌-19 రోగుల మెదడుకు తీసిన సీటీ, ఎమ్మారై స్కాన్లను పరిశీలించి ఈ మేరకు నిర్ధరించారు.

ఇదీ చూడండి:కరోనాపై 'ప్లాస్మా థెరపీ' హిట్​-కోలుకున్న బాధితుడు

Last Updated : Apr 27, 2020, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.