ETV Bharat / bharat

'మహా'లో కరోనా విజృంభణ.. కొత్తగా 8,139 కేసులు

author img

By

Published : Jul 11, 2020, 8:57 PM IST

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీలో వైరస్​ ప్రభావం అధికంగా ఉంది. మహారాష్ట్రలో ఇవాళ 8వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరువైంది. తమిళనాడులో ఇవాళ దాదాపు 4 వేల మంది వైరస్​ బారిన పడ్డారు.

CORONA VIRUS LATEST TALLY IN INDIA
తమిళనాడులో కరోనా ఉద్ధృతి

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. అయితే.. రికవరీ రేటు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 5 లక్షల మార్కును దాటినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 62.78 శాతానికి చేరుకున్నట్లు తెలిపింది.

మహారాష్ట్రలో అధికం..

మహారాష్ట్రలో కరోనా రికార్డులు సృష్టిస్తోంది. ఇవాళ కొత్తగా 8,139 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 223 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,360 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,46,600కి, మరణాలు 10,116కు చేరాయి. 99వేల 202 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 1,36,985 మంది కోలుకున్నారు.

తమిళనాడులో..

తమిళనాడులో ఇవాళ 3,965 కొత్త కేసులు భయటపడ్డాయి. మరో 69 మంది మరణించారు. నేడు 3,591 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,34,226కు.. మరణాలు 1,898కి చేరాయి. 46వేల 410 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

దిల్లీలో..

దేశరాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 1,781 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,998 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,10,921కి.. మరణాలు 3,334కు చేరాయి. ఇప్పటి వరకు 87,692 మంది కోలుకున్నారు.

కేరళలో మళ్లీ విజృంభణ..

దేశంలో తొలికేసు నమోదైన కేరళలో కరోనా కట్టడి అయినట్లు కనిపించినా ఇటీవల మళ్లీ విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 488 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 195 హాట్​స్పాట్​లను గుర్తించారు అధికారులు.

వివిధ రాష్ట్రాల్లో కేసుల వివరాలు ఇలా..

రాష్ట్రంకొత్త కేసులుమరణాలుమొత్తం కేసులుమొత్తం మరణాలు
మహారాష్ట్ర8,139 223 2,46,60010,116
తమిళనాడు3,965691,34,2261,898
దిల్లీ1,781 34 1,10,9213,334
గుజరాత్​8721041,0272,034
హరియాణా648720,582297
కేరళ48826,95027
ఉత్తరాఖండ్​4503,41746
మణిపూర్​1101593 0
హిమాచల్​ ప్రదేశ్​ 43117511

ఇదీ చూడండి: 'ఐఏఎస్, ఐపీఎస్​లా 'ఇండియన్ మెడికల్ సర్వీస్​' కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.