ETV Bharat / bharat

ముంబయిపై కరోనా పంజా- ఒక్కరోజులో 212 కేసులు - కరోనా వైరస్​ ఇండియా

దేశంలో కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో వైరస్​కు​ కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముంబయిలో ఈ ఒక్క రోజే 212 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

CORONA VIRUS CASES IN INDIA RISES SHARPLY
దేశంలో కరోనా విజృంభణ- బెంబేలెత్తుతున్న ముంబయి
author img

By

Published : Apr 10, 2020, 9:00 PM IST

మహారాష్ట్ర.. కరోనా వైరస్​కు కేంద్రబిందువుగా మారింది. ముఖ్యంగా వైరస్​ ధాటికి ముంబయి బెంబేలెత్తుతోంది. దేశ వాణిజ్య రాజధానిలో ఒక్కరోజులో 212 పాజిటివ్​ కేసులు నమోదవడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో ముంబయిలో మొత్తం కేసుల సంఖ్య 993కు చేరింది. ఈ రోజు 10మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ముంబయిలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 64కు చేరింది. అయితే డిశ్ఛార్జ్​ అవుతున్న వారి సంఖ్య కొంత మెరుగుపడింది. మొత్తం 69మంది కరోనాను జయించారు.

ముంబయిలో ఈ రోజు నమోదైన కేసుల్లో ఇద్దరు నర్సులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బృహన్​ముంబయి పురపాలక సంఘం(బీఎమ్​సీ).. ప్రైవేటు ఆసుపత్రులకు పలు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే తమ నర్సులను క్వారంటైన్​ చేయాలని స్పష్టం చేసింది. కొత్త వారిని విధుల్లోకి తీసుకోవద్దని తెలిపింది.

అయితే మహారాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాలు.. బీఎమ్​సీకి విరుద్ధంగా ఉంది. ఈరోజు 132కేసులు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించింది.

మహారాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 1,574కు చేరింది.

ఇతర రాష్ట్రాల్లో ఇలా...

  • దిల్లీలో 24 గంటల్లో 183 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 154మందికి నిజాముద్దీన్​ జమాత్​ మర్కజ్​తో సంబంధం ఉంది. మొత్తం కేసుల సంఖ్య 903కి చేరింది.
  • తమిళనాడులో మరో 77 కరోనా కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 911కి చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఇవాళ మరొకరు మరణించగా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 9కి చేరినట్లు తెలిపారు.
  • ఉత్తరప్రదేశ్​లో 21 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 431కి చేరింది.
  • గుజరాత్​లో ఇవాళ మరో 70 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 378కి చేరినట్లు ప్రకటించిన ఆరోగ్య శాఖ అధికారులు.. 33 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19 మరణాలు సంభవించాయి.
  • హరియాణాలో మొత్తం 162 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 22 మంది కోలుకున్నారు.
  • కర్ణాటకలో 24 గంటల వ్యవధిలో 10 కొత్త కేసులు నమోదవగా.. మొత్తం బాధితులు 207కి చేరారు. 34 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి ఆరుగురు మరణించారు.
  • కేరళలో శుక్రవారం కొత్తగా 7 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 238కి చేరినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 124 మంది కోలుకున్నట్లు ప్రకటించారు మంత్రి కేకే శైలజ.
  • బంగాల్​లో మరో 12 కొత్త కేసులతో కరోనా బాధితుల సంఖ్య 89కి చేరింది.
  • పంజాబ్​లో 151, ఒడిశాలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 48కి చేరింది.
  • చండీగఢ్​లో కరోనా పాజిటివ్​ కేసులు 19కి చేరాయి.
  • త్రిపురలో ఇవాళ మరొకరికి కరోనా సోకగా.. రాష్ట్రంలో బాధితుల సంఖ్య రెండుకు చేరింది.

ఇదీ చూడండి:- అగ్రరాజ్యాలకన్నా భారత్​లోనే మరణాల రేటు తక్కువ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.