దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొద్ది రోజులుగా 20 వేల లోపే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. కొత్తగా 18,177 కేసులు నమోదయ్యయి. 217 మంది మరణించారు.
కొత్తగా 20,923 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 2.39 శాతానికి పడిపోయాయి. రికవరీ రేటు 96.16కు చేరింది. మరణాల రేటు 1.45 శాతానికి పడిపోయింది.
- మొత్తం కేసులు: 1,03,23,965
- క్రియాశీల కేసులు: 2,47,220
- కోలుకున్నవారు: 99,27,310
- మరణాలు: 1,49,435
17.5 కోట్ల పరీక్షలు..
కరోనా మహమ్మారి సోకిన వారిని గుర్తించేందుకు జనవరి 2 వరకు మొత్తం 17,48,99,783 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది భారత వైద్య పరిశోధన మండలి-ఐసీఎంఆర్. అందులో శనివారం ఒక్క రోజే.. 9,58,125 పరీక్షలు జరిపినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: టీకా వినియోగంపై నేడు డీసీజీఐ కీలక ప్రకటన