దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 11,502 మంది వైరస్ బారినపడగా.. మరో 325 మంది మహమ్మారితో మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 9520 కు పెరగ్గా.. బాధితుల సంఖ్య 3,32,424 లకు చేరింది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

అత్యధిక మరణాలు గల రాష్ట్రాలివే..
మొత్తం మరణాల్లో ఎక్కువగా.. మహారాష్ట్రలో 3850 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో 1477 మంది, దిల్లీలో 1327 మంది, బంగాల్లో 475 మంది, మధ్యప్రదేశ్లో 459 చొప్పున మృతి చెందారు.
ఇదీ చదవండి: కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటుతో ఊరట