భారత్లో కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 194 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6,566 మంది వైరస్ బారినపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కొవిడ్-19 బాధితుల సంఖ్య లక్షా 58 వేలు దాటింది.
దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1897 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 56,948కి చేరింది. గుజరాత్లో 938, మధ్యప్రదేశ్లో 313 మంది కొవిడ్-19 ధాటికి ప్రాణాలు కోల్పోయారు.