ETV Bharat / bharat

'ఊపిరితిత్తుల కణాలను హైజాక్​ చేస్తున్న కరోనా' - ప్రొటిన్​ విధులు ఫాస్ఫోరిలేషన్​ ప్రక్రియ

కరోనా వైరస్​కు సంబంధించి కీలక ప్రక్రియను వెలుగులోకి తెచ్చారు అమెరికా శాస్త్రవేత్తలు. మహమ్మారి సోకిన తర్వాత మానవ ఊపిరితిత్తుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల్లోని ప్రొటీన్లు, ఫాస్ఫోరిలేషన్​ కణాలపై అధిక ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు.

Corona damaging lung cells
'ఊపిరితిత్తుల కణాలను హైజాక్​ చేస్తున్న కరోనా'
author img

By

Published : Dec 14, 2020, 8:38 AM IST

కరోనా వైరస్ సోకిన తర్వాత మానవ ఊపిరితిత్తుల్లోని కణాల్లో తలెత్తిన పరమాణు ప్రతిస్పందనలను అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ కణాలను వైరస్​ హైజాక్​ చేస్తున్న తీరును వెలుగులోకి తెచ్చారు. కొవిడ్​-19 చికిత్సకు అనువైన ఔషధాలను గుర్తించడానికి ఇది వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. మాస్​ స్పెక్ట్రోమెట్రీ సాంకేతికత సాయంతో మానవ ఊపిరితిత్తుల్లోని శ్వాసకోశాలకు సంబంధించిన కణాలపై బోస్టన్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. కరోనా సోకిన ఊపిరితిత్తుల కణాల్లోని ప్రొటీన్లు, అణువుల చర్యల క్రమాన్ని పరిశీలించారు. సాధారణ ఊపిరితిత్తుల కణాలతో పోలిస్తే వీటిలోని ప్రొటీన్లు, ఫాస్ఫోరిలేషన్​ ప్రక్రియల్లో అనూహ్య మార్పులను గమనించారు. ఇన్​ఫెక్షన్​ సోకిన గంటలోపే గణనీయ స్థాయిలో మార్పులు జరిగాయని వారు తెలిపారు. జీవుల కణాల్లోని ప్రొటీన్ విధులను నియంత్రించడంలో ఫాస్ఫోరిలేషన్​ ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యంగా ఉన్న కణాల్లో ప్రొటీన్​ లభ్యత, ఫాస్ఫోరిలేషన్ల క్రమంపై ప్రభావం పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అసాధారణ మార్పుల వల్ల వైరస్​ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నట్లు తేల్చారు.

ఈ క్రమంలో ఆరోగ్యకరమైన కణాలు నాశనమవుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల ఊపిరితిత్తుల్లో గాయం పెద్దదవుతోందని తెలిపారు. "ఇన్​ఫెక్షన్​ సోకగానే..మానవ కణంలోని వ్యవస్థలను వైరస్​ తనకు అనుకూలంగా మలచుకుంటోంది. తద్వారా మానవ రోగనిరోధకశక్తిని తప్పించుకుంటూ వ్యాధిని వ్యాప్తి చేస్తోంది." అని పరిశోధనలో పాలుపంచుకున్న ఆండ్రూ ఎమిలీ తెలిపారు. ఈ ప్రక్రియలను అడ్డుకునే సామర్థ్యం... ఇప్పటికే ఆమోదం పొందిన 18 ఔషధాలకు ఉన్నట్లు తేల్చారు. వీటిని కొవిడ్​-19 నియంత్రణకు వాడొచ్చని పేర్కొన్నారు. ఈ పరిశోధన ద్వారా మహమ్మారికి సంబంధించిన కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు.

ఇదీ చదవండి : కరోనాకు తోడైన కల్తీ.. ప్రమాదకరంగా ఆహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.