ETV Bharat / bharat

'మహా' విలయం.. కొత్తగా 12,712 కేసులు, 344 మరణాలు - COVID-19 UPDATE

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 12,712, కర్ణాటకలో 7,883, యూపీలో 4,475, దిల్లీలో 1,113 కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 56,110 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 70 శాతానికి చేరింది.

CORONA CASES LATEST TALLY IN INDIA
యూపీలో కరోనా ఉగ్రరూపం.
author img

By

Published : Aug 12, 2020, 5:43 PM IST

Updated : Aug 12, 2020, 10:21 PM IST

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 12,712 కేసులు, 344 మరణాలు సంభవించాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5,48,313కు చేరింది. 18,650 మంది మరణించారు. ప్రస్తుతం 1,47,513 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరో 13,408 మంది డిశ్చార్జి కాగా.. మొత్తం 3,81,843 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

కర్ణాటకలో..

కర్ణాటకలో కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ఇవాళ మరో 7,883 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. అయితే 7,034 మంది వైరస్​ నుంచి కోలుకోవటం కాస్త ఊరట కలిగిస్తోంది. మరో 113 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,96,494, మరణాలు 3,510కి చేరాయి. ప్రస్తుతం 80,343 మంది చికిత్స పొందుతున్నారు.

తమిళనాడులో..

తమిళనాడులో కొత్తగా 5,871 కొత్త కేసులు నమోదయ్యాయి. 119 మంది వైరస్​ బారినపడి మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3,14,520, మరణాలు 5,278కి చేరాయి. ప్రస్తుతం 52,929 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

యూపీలో..

ఉత్తర్​ప్రదేశ్​లో బుధవారం మరో 4,475 కొత్త కేసులు నమోదయ్యాయి. 54 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,36,238కి చేరింది. ఇప్పటి వరకు 2,230 మంది మరణించారు. 84, 661 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 49,347 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 34 లక్షల పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఒక్కరోజే 97వేల నమూనాలు పరీక్షించారు.

బంగాల్​లో..

బంగాల్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 2,936 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 54 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,04,326కు, మరణాలు 2,203కు చేరాయి. ప్రస్తుతం 26,003 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

దిల్లీలో మళ్లీ..

దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 1,113 మంది వైరస్​ బారిన పడ్డారు. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 1,021 మంది వైరస్​ నుంచి కోలుకోవటం ఊరట కలిగించే విషయం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,48,504కు, మరణాలు 4,153కు చేరాయి. ఇప్పటి వరకు 1,33,405 మంది డిశ్చార్జి అయ్యారు.

ఉత్తరాఖండ్​లో..

ఉత్తరాఖండ్​లో 439 కొత్త కేసులు నమోదయ్యాయి. 217 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 10,886కు, మరణాలు 140కి చేరాయి. 6,687 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. 4,020 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

పంజాబ్​లో..

పంజాబ్​లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇవాళ 1020 మందికి వైరస్​ సోకగా.. 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 26,909కి చేరాయి. 675 మంది మరణించారు.

70 శాతానికి చేరిన రికవరీ రేటు

దేశంలో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. అదే స్థాయిలో వైరస్​ నుంచి కోలుకుంటున్నారు. బుధవారం రికార్డు స్థాయిలో 56,110 మంది వైరస్​ బారి నుంచి బయటపడ్డారు. దీంతో దేశ రికవరీ రేటు 70 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం 16,39,599 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 27.64 శాతం మాత్రమే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో మరణాల రేటు 1.98 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

సమర్థమైన​ కట్టడి వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయటం, సమగ్ర పరీక్షలు, తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి సరైన చికిత్సలతో రికార్డు స్థాయిలో 56,110 మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో పని చేయటం వల్ల రోజువారీ రికవరీ సగటు క్రమంగా పెరుగుతోందని వివరించింది.

ఇదీ చూడండి: యుద్ధభూమిని తలపిస్తోన్న బెంగళూరు పులకేసినగర్​

Last Updated : Aug 12, 2020, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.