ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా కొత్తగా 19,906 కేసులు, 410 మరణాలు - Corona cases latest update

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 19,906 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 410 మంది కరోనాకు బలయ్యారు.

daily corona virus update
దేశంలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : Jun 28, 2020, 9:44 AM IST

Updated : Jun 28, 2020, 9:58 AM IST

దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. వైరస్​ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 19,906 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 410 మంది వైరస్​కు బలయ్యారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం.

శనివారం(జూన్​ 27) వరకు మొత్తం 82,27,802 నమూనాలను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన సంస్థ ఐసీఎంఆర్​ తెలిపింది. అందులో 2,31,095 నమూనాలు ఒక్క శనివారమే పరీక్షించామని వెల్లడించింది.

corona virus
దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు
  • మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 1,59,133కు చేరింది. 7,273మంది ప్రాణాలు కోల్పోయారు. 84,245మంది కోలుకున్నారు.
  • తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 78,335కు చేరింది. 1025 మంది మృతి చెందారు. 33,216యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • దిల్లీలో కేసుల సంఖ్య 80,188కి చేరింది. మొత్తం 2,558 మంది ప్రాణాలు కోల్పోయారు. 49,301 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. 28,329మంది చికిత్స పొందుతున్నారు.
  • గుజరాత్​లో వైరస్​ కేసుల సంఖ్య 30,095కు చేరింది. ఇప్పటివరకు 1,771 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,294 మంది చికిత్స పొందుతున్నారు.

Last Updated : Jun 28, 2020, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.