ETV Bharat / bharat

'పౌర' జ్వాల: ఆందోళనలతో దద్దరిల్లిన దిల్లీ - against citizenship law near Jama Masjid in delhi

పౌరసత్వ చట్టం, ఎన్​ఆర్సీకి వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. శుక్రవారం జామా మసీద్, సీమాపురి, జఫారాబాద్, దర్యాగంజ్​, శీలంపుర్ ప్రాంతాల్లో చేపట్టిన ప్రదర్శనలు ఉద్రిక్తంగా మారాయి. దర్యాగంజ్, దిల్లీ గేట్ వద్ద హింస చెలరేగింది.

continue protest in delhi against citizenship law near Jama Masjid
'పౌర' జ్వాల: ఆందోళనలతో దద్దరిల్లిన దిల్లీ
author img

By

Published : Dec 20, 2019, 7:58 PM IST

Updated : Dec 20, 2019, 11:28 PM IST

'పౌర' జ్వాల: ఆందోళనలతో దద్దరిల్లిన దిల్లీ

'పౌర' చట్టం, ఎన్​ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో దిల్లీ దద్దరిల్లింది. ఉదయం నుంచి వేలాది మంది త్రివర్ణ పతాకాలను చేతబట్టి, "రాజ్యాంగాన్ని రక్షించండి" అనే నినాదాలతో హస్తిన వీధుల్ని హోరెత్తించారు.

దిల్లీ గేటు వద్ద ఉద్రిక్తత

శుక్రవారం ప్రార్థనల తర్వాత జామా మసీదు వద్ద వేలాది మంది నిరసన ప్రదర్శన చేపట్టారు. భీమ్ ఆర్మీ సారథి ఆజాద్ చంద్రశేఖర్ ఇందుకు నేతృత్వం వహించారు. వీరంతా 'పౌర' చట్టం, ఎన్​ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జంతర్ మంతర్​కు ర్యాలీగా వెళుతుండగా పోలీసులు దిల్లీ గేటు వద్ద అడ్డుకున్నారు. ఫలితంగా ఉద్రిక్తకర పరిస్థితి తలెత్తింది. చౌరీ బజార్, లాల్ క్వైలా, జామా మసీద్, దిల్లీ గేటు మెట్రో స్టేషన్లను మూసివేయాల్సి వచ్చింది.

షా ఇంటి ముట్టడికి యత్నం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటిని దిల్లీ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు వినూత్న రీతిలో పోలీసులకు గులాబీ పూలు ఇచ్చి నిరసన తెలిపారు.

డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ

జఫ్రాబాద్​ నుంచి శీలంపుర్​కు నిరసనకారులు ప్రదర్శన చేపట్టగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. శీలంపుర్​లో 144 సెక్షన్ విధించారు. ఈశాన్య దిల్లీలోని 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతలను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
సీమాపురిలో నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో షహదారా అడిషనల్ డీసీపీ రాజ్​బీర్ సింగ్ గాయపడ్డారు. తలకు రాయి బలంగా తగలగా ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

మరోమారు హింస

దర్యాగంజ్​లో సాయంత్రం వందల మంది రోడ్డెక్కగా మరోమారు హింస చెలరేగింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. ఆగ్రహించిన ఆందోళనకారులు ఒక కారుకు నిప్పు పెట్టారు.

AP Video Delivery Log - 1300 GMT News
Friday, 20 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1251: China Ethiopia No Access Mainland China 4245716
China launches Ethiopia's first-ever satellite
AP-APTN-1247: Kosovo Air Pollution AP Clients Only 4245715
EU funds massive clean air effort in Kosovo
AP-APTN-1246: France Orange Verdict AP Clients Only 4245714
French telecom company Orange convicted over suicides
AP-APTN-1238: Lebanon US AP Clients Only 4245710
US undersecretary of state visits Lebanon
AP-APTN-1235: India Citizenship Protest 2 AP Clients Only 4245713
Thousands in New Delhi protest citizenship law
AP-APTN-1230: Sweden Thunberg No access Sweden 4245709
Greta Thunberg's first school strike since return to Stockholm
AP-APTN-1228: China MOFA AP Clients Only 4245708
China urges dialogue between US and NKorea
AP-APTN-1227: Russia IS Families Part mandatory on-screen credit to UNICEF 4245697
Russians desperate for news of family in IS camps
AP-APTN-1226: UK Brexit Politics 2 News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4245706
UK's Corbyn: Brexit deal is still terrible for Britain
AP-APTN-1226: Australia PM Protest Part must credit River McCrossen 4245707
Climate change protests outside Australia PM's house
AP-APTN-1219: Belgium Puigdemont AP Clients Only 4245692
Puigdemont on latest ECJ ruling
AP-APTN-1159: Iraq Prayers No access Iraq 4245699
Iraqi Shiite spox calls for new government
AP-APTN-1158: US FL Starliner Launch AP Clients Only 4245698
Rocket launched carrying Boeing spacecraft
AP-APTN-1148: Germany Military Rabbis AP Clients Only 4245695
Germany to re-introduce military rabbis
AP-APTN-1129: Croatia Election Preview Part no access Croatia 4245691
Croatia heads into tight presidential election
AP-APTN-1103: Netherlands Climate Court AP Clients Only 4245683
Climate activists final victory in Dutch court ruling
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 20, 2019, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.