పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జేఎన్‌యూ ఘటనపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ భేటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు.
భేటీలో.. పౌరసత్వ చట్టం సహా ప్రతిపాదిత జాతీయ పౌర పట్టిక, జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి గురించి ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పెద్దయెత్తున ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో.. పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు చర్చించారు.
ఇదీ చూడండి:బంగాల్ పర్యటనలో మోదీకి నిరసనల స్వాగతం