ETV Bharat / bharat

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్​ వ్యూహాలు!

author img

By

Published : Sep 5, 2020, 7:51 AM IST

పార్లమెంట్​ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది ప్రతిపక్ష కాంగ్రెస్​. కేంద్రం తీసుకురానున్న 11 ఆర్డినెన్స్​ల్లో నాలుగింటిని అడ్డుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.

Congress plans to oppose
పార్లమెంట్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ కసరత్తు!

పార్లమెంట్​ వర్షకాల సమావేశాల సమయం దగ్గరపడుతున్న క్రమంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేపట్టింది కాంగ్రెస్​. దివాలా చట్టం​, పన్ను సహా ఇతర అంశాలకు సంబంధించిన 11 ఆర్డినెన్స్​ల్లో నాలుగింటిని అడ్డుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఈ మేరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​ నేతృత్వంలోని కాంగ్రెస్​ సమన్వయ కమిటీ గురువారం సమావేశమైంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయటంపై ఉభయ సభల స్పీకర్లకు లేఖ రాయాలని నిర్ణయించింది.

"రానున్న పార్లమెంట్​ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాల్లో 15 సమస్యలను గుర్తించాం. అందులో కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగిత రేటు, భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తత, వలస కార్మికుల సమస్యలు, ధరల పెరుగుదల, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, ఫేస్​బుక్​ వివాదం వంటి ఇతర అంశాలు ఉన్నాయి. పార్లమెంట్​లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాల మధ్య సమన్వయం కోసం ఇవే అంశాలపై ప్రశ్నిస్తోన్న పార్టీలతో చర్చించాం."

- కాంగ్రెస్​ సీనియర్​ నేత

కమిటీలో చర్చించిన అంశాలపై తుది నివేదికను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపనున్నట్లు తెలిపారు నేతలు. అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న 11 ఆర్డినెన్స్​ల అంశంలో పార్టీ వైఖరిపై తుది నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలిపారు.

పార్లమెంట్​ సమావేశాలకు ముందు కాంగ్రెస్​ వ్యూహాత్మక బృందం భేటీ కానుందని తెలిపారు నేతలు. దీనికి మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, రాహూల్​ గాంధీ, పీ చిదంబరం వంటి కీలక నేతలు హాజరుకానున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: మారని హస్తరేఖలు.. కుటుంబ పరిధి దాటని కాంగ్రెస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.