కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీలో నాయకత్వ శూన్యత ఉందని సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ చేసిన విమర్శలపై ఆయన ఈ విధంగా స్పందించారు.
"నేను ఇతరుల (సల్మాన్ ఖుర్షీద్) విమర్శలపై స్పందించను. కానీ కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ పరిస్థితులను సమీక్షించుకుని, మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ఇది అత్యవసరం."- జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధిస్తుందని సింధియా విశ్వాసం వ్యక్తం చేశారు.
సాధారణ ఎన్నికల్లో ఓటమి పొందిన కాంగ్రెస్ తేరుకోవడానికి మరింత సమయం పడుతుందని ఇంతకుముందు సల్మాన్‌ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. నాయకత్వ లేమి పార్టీని ఇబ్బందిపెడుతోందని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: కర్ణాటక: ప్రతిపక్షనేతలుగా సిద్ధరామయ్య, పాటిల్ నియామకం