తిహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని కాంగ్రెస్ అగ్రనేతలైన గులాం నబీ అజాద్, అహ్మద్ పటేల్ బుధవారం కలిశారు. వారి వెంట చిదంబరం కుమారుడు కార్తీ కూడా ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కశ్మీర్ అంశం, ఆర్థిక మాంద్యం తదితర విషయాలపై దాదాపు అరగంట పాటు వీరు చర్చించుకున్నట్లు సమాచారం.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గత నెల 21న సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా...జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. దీంతో సెప్టెంబరు 5 నుంచి ఆయన తిహార్ జైల్లో ఉంటున్నారు. ఈ కేసులో బెయిల్ కోసం చిదంబరం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 23న విచారణ జరగనుంది. మరోవైపు ఆయన జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది.
ఇదీ చూడండి : మందగమనంపై ప్రియాంక 'హౌదీ-మోదీ' పంచ్