పశ్చిమ్ బంగాలో విజయదశమి వేడుకలు ఏటా ఘనంగా నిర్వహిస్తారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఆ రాష్ట్రంలో దుర్గామాత పూజలు నిర్వహిస్తారు. ఈసారి కరోనా కారణంగా ఆంక్షల నడుమే పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కోల్కతాలోని దుర్గా పూజా కమిటీ వినూత్న ఆలోచనతో విగ్రహాన్ని రూపొందించింది. దుర్గామాత వైద్యురాలి అవతారమెత్తి కరోనా వైరస్ అంతమొందించే ఇతివృత్తంతో దీన్ని తయారు చేశారు.
-
Brilliantly appropriate #covid19-themed Durga Puja creativity from Kolkata, with the goddess slaying the virus! Salutations to the unknown designer & sculptor #DurgaPuja2020 pic.twitter.com/Q8ZT8EtWfo
— Shashi Tharoor (@ShashiTharoor) October 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Brilliantly appropriate #covid19-themed Durga Puja creativity from Kolkata, with the goddess slaying the virus! Salutations to the unknown designer & sculptor #DurgaPuja2020 pic.twitter.com/Q8ZT8EtWfo
— Shashi Tharoor (@ShashiTharoor) October 19, 2020Brilliantly appropriate #covid19-themed Durga Puja creativity from Kolkata, with the goddess slaying the virus! Salutations to the unknown designer & sculptor #DurgaPuja2020 pic.twitter.com/Q8ZT8EtWfo
— Shashi Tharoor (@ShashiTharoor) October 19, 2020
ఈ విగ్రహాన్ని చూసి ముగ్ధులైపోయారు కాంగ్రెస్ నేత శశిథరూర్. సృజనాత్మకతతో రూపొంచిందిన దుర్గామాత విగ్రహం అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. దీన్ని తయారు చేసిన రూపకర్త, శిల్పికి సెల్యూట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
బంగాల్లో ఈనెల 22నుంచి విజయదశమి వేడుకలు ప్రారంభంకానున్నాయి. కరోనా నేపథ్యంలో దుర్గామాత మండపాల్లో ఈసారి సందర్శకులకు అనుమతి లేదని కోల్కతా హైకోర్టు సోమవారం తెలిపింది. పెద్ద మండపాల్లో 25మంది, చిన్న మండపాల్లో 15మంది నిర్వాహకులకే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.