ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ నేతలు బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, జేడీఎస్ సీనియర్ నేత హెచ్డీ దేవెగౌడ, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర, కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యేల రాజీనామా విషయం తెలియగానే అమెరికా పర్యటనలో ఉన్న కుమారస్వామి హుటాహుటిన బెంగళూరు చేరుకున్నారు. వచ్చీ రాగానే నేరుగా హోటల్లో జరిగే సమావేశానికి హాజరయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి.
వెనక్కి తగ్గం: ఎమ్మెల్యేలు
రాజీనామా నిర్ణయంపై వెనక్కు తగ్గేదీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ తెలిపారు. ముంబయి లోని ఓ హోటల్లో బస చేస్తున్న 13 మంది ఎమ్మెల్యేలందరూ ఇదే మాటకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.
"నాతో కలిపి 13 మంది ఎమ్మెల్యేలందరమూ కలిసి స్పీకర్‌కు రాజీనామా సమర్పించి గవర్నర్‌కు సమాచారం ఇచ్చాం. అందరమూ కలిసే ఉన్నాం. తిరిగి బెంగళూరుకు వెళ్లే ప్రసక్తే లేదు. రాజీనామాలను వెనక్కు తీసుకోం."
-ఎస్టీ సోమశేఖర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇదీ చూడండి: 'సంక్షోభానికి కాంగ్రెస్- జేడీఎస్ అంతర్గత కలహాలే కారణం'