ETV Bharat / bharat

నేడే బలపరీక్ష- మధ్యప్రదేశ్​ పీఠం భాజపాకే!

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం కూలిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన వేళ సభాపతి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నిన్న అర్ధరాత్రి 16 మంది కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదించారు స్పీకర్​. ప్రస్తుతం మెజారిటీ ఉన్న కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం భాజపాకు ఉంది.

Congress, BJP issue whips to their MLAs on trust vote eve
నేడు బలపరీక్ష- మధ్యప్రదేశ్​ పీఠం భాజపాకే!
author img

By

Published : Mar 20, 2020, 6:53 AM IST

Updated : Mar 20, 2020, 7:02 AM IST

బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన వేళ 16 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను ఎంపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్​పీ ప్రజాపతి ఆమోదించారు. ఫలితంగా కాంగ్రెస్ బలం 114 నుంచి 92కు పడిపోయింది. 230 మంది సభ్యులున్న ఎంపీ శాసనసభలో 2 ఖాళీలు ఉండగా సభ్యుల సంఖ్య 206కు పడిపోయింది.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 104 కాగా భాజపాకు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఫలితంగా కమల్​నాథ్​ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోవటం ఖాయంగానే కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​ చౌహాన్​ మళ్లీ ఎంపీ పీఠం ఎక్కే అవకాశం ఉంది.

ముందే చేయాల్సింది..

రాజీనామాలపై స్పీకర్​ నిర్ణయం ముందే తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు చౌహాన్​. సుప్రీంకోర్టు జోక్యం లేకపోతే ఇప్పటివరకు దీనిని తీవ్రమైన అంశంగా పరిగణించాల్సి వచ్చేదని అన్నారు.

సుప్రీం తీర్పు..

మధ్యప్రదేశ్​ రాజకీయ పరిణామాలపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. శాసనసభలో శుక్రవారం సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్​ ఎన్​పీ ప్రజాపతిని ఆదేశించింది. బలపరీక్ష కోసమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని స్పష్టం చేసింది.

ఎమ్మెల్యేలను చేతులు పైకెత్తమని ఓట్ల లెక్కింపు చేపట్టాలని సూచించింది సుప్రీంకోర్టు. అసెంబ్లీ సమావేశాలను వీడియోలో చిత్రీకరించాలని, వీలైతే ప్రత్యక్ష ప్రసారం చేయాలని జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

చట్ట ఉల్లంఘనలు జరగకుండా చూసే బాధ్యత అసెంబ్లీ కార్యదర్శికి అప్పజెప్పింది. కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు 16 మంది విశ్వాస పరీక్షకు హాజరుకావాలని అనుకుంటే వారికి పూర్తి భద్రత కల్పించాలని మధ్యప్రదేశ్‌, కర్ణాటక డీజీపీలకు సుప్రీం సూచించింది.

అంతకుముందు రెబల్​ ఎమ్మెల్యేలతో వీడియో లింక్​ ద్వారా మాట్లాడాలని మధ్యప్రదేశ్​ అసెంబ్లీ స్పీకర్ ఎన్​పీ ప్రజాపతికి సూచించగా.. ఆయన నిరాకరించారు. సుప్రీం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

విప్​ జారీ..

బలపరీక్ష నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలకు భాజపా, కాంగ్రెస్ విప్​ జారీ చేశాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ సభకు హాజరు కావాలని స్పష్టం చేశాయి.

ఇదీ చదవండి: నిర్భయ దోషులకు ఉరి- తిహార్​ జైలులో ఏర్పాట్లు పూర్తి

Last Updated : Mar 20, 2020, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.