కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధాన రాజకీయ ఆయుధంగా పేదరికాన్నే ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. పేదరిక నిర్మూలనకు ఉత్తమ పరిష్కారం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండటమేనని పిలుపునిచ్చారు మోదీ. కాంగ్రెస్ ఉన్నంత కాలం పేదరిక నిర్మూలన సాధ్యం కాదని... కాంగ్రెస్‌ను పక్కనపెడితే పేదరికం దానికదే కనిపించకుండా పోతుందని అన్నారు.
ఒడిశా బలంగిర్ లోక్‌సభ నియోజకవర్గంలోని సోనేపుర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ.
"ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేస్తారా చేయరా? పేదలకు సంబంధించిన అభివృద్ధి పథకాలను రాజకీయం చేస్తున్నారు. దళారులకు మేలు చేకూరుస్తూ ఉంటే పేదరికం అంతమవదు. కాంగ్రెస్ చేసిన తప్పే బీజేడీ ప్రభుత్వం చేస్తోంది. ఈ కారణంగానే వారి అనుకూలుల ఆటకట్టించాం. " -నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కాంగ్రెస్ హఠావో అని పిలుపునిచ్చారు మోదీ. పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్ కేవలం నినాదాలు ఇచ్చిందే కాని భరోసా కల్పించేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.