లద్దాఖ్ సరిహద్దులో ఉద్రిక్తతల విషయంలో దేశ ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని.. ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కాంగ్రెస్ సూచించింది. కొద్ది రోజులుగా ఈ అంశంపై పదేపదే.. చైనాతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వ పెద్దలు ఆ సమాచారాన్ని దేశ ప్రజలతో కూడా పంచుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇదే రాజధర్మమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు.
ఇప్పటికే కార్ప్స్ కమాండర్ స్థాయి నుంచి రక్షణ మంత్రుల స్థాయి వరకు చాలా సార్లు చర్చలు జరిగాయని.. వాటి సారాంశం ఏంటన్నది మాత్రం దేశప్రజలకు చెప్పకుండా దాస్తున్నారని రణ్‌దీప్ ఆరోపించారు. కానీ దేశ ప్రజలు మాత్రం వాటిని తెలుసుకోవాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:- చైనా రక్షణమంత్రి ముందే తేల్చిచెప్పిన రాజ్‌నాథ్
1962 తర్వాత సరిహద్దుల్లో.. మొదటిసారి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయంటూ.. విదేశీవ్యవహారాల కార్యదర్శి హర్షవర్దన్ ష్రింగ్లా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన రణ్‌దీప్.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేశ ప్రజలను ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. విశ్వాసంలోకి తీసుకోవాలనుకోవడం లేదా? అని ప్రశ్నించారు.
ఉద్రిక్తతలు...
భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఈ ఏడాది మే నెల నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘటనతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరుగుతున్నప్పటికీ... చైనా ద్వంద్వ వైఖరితో సమస్య ఓ కొలిక్కి రావడం లేదు.
ఇవీ చూడండి:-