కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఓ మీడియా కథనం ఆధారంగా ఈ ఆరోపణలు చేశారు. ఆ కథనం ప్రకారం ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై వచ్చిన ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన ఫిర్యాదులను విచారించి క్లీన్చిట్ ఇచ్చిన ఎన్నికల కమిటీ నిర్ణయాన్ని అందులోని ఓ సభ్యుడైన అశోక్ లవాసా వ్యతిరేకించారు. ఆ తర్వాత జరిగిన ఏ సమావేశంలోనూ ఆయన పాల్గొనలేదని కథనంలో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై తీసుకునే నిర్ణయాల్లో మరింత పారదర్శకత అవసరమనే అభిప్రాయాన్ని లవాసా వ్యక్తం చేసినట్లు కథనంలో ఉంది.
ఈ కథనాన్ని పేర్కొంటూ సుర్జేవాలా 'ప్రజాస్వామ్యంలో ఇది మరో చీకటి రోజు' అంటూ ట్వీట్ చేశారు.
"సుప్రీం కోర్టు న్యాయమూర్తుల బహిరంగ పత్రికా సమావేశం, ఆర్బీఐ గవర్నర్ రాజీనామా, సీబీఐ డైరక్టర్ తొలగింపు, సీవీసీ వివేక రహిత నివేదికలు, ఇప్పుడు ఎన్నికల సంఘంలో విభజన!"
- ట్విట్టర్లో రణ్‌దీప్ సుర్జేవాలా
లవాసా వ్యవహారంపై కథనం సహా కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా స్పందించారు. ఇలాంటి వార్తలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈసీలోని ముగ్గురు సభ్యుల ఆలోచనలు, సారూప్యతలు ఒకలా ఉండాలని అనుకోరాదని, గతంలోనూ భేదాభిప్రాయాలు ఉన్నాయని స్పష్టంచేశారు సునీల్ అరోడా.
- ఇదీ చూడండి: పవిత్ర గుహలో 'మోదీ బాబా' యోగ ముద్ర