ETV Bharat / bharat

'కమలం'పై ఉమ్మడి పోరుకు కాంగ్రెస్ కసరత్తులు! - కాంగ్రెస్​ తాజా వార్తలు

ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ అధికార భాజపాపై ఉమ్మడి పోరు చేసేందుకు కాంగ్రెస్​ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

'కమలం'పై ఉమ్మడి పోరుకు కాంగ్రెస్ కసరత్తులు!
author img

By

Published : Oct 31, 2019, 5:41 AM IST

Updated : Oct 31, 2019, 8:36 AM IST

'కమలం'పై ఉమ్మడి పోరుకు కాంగ్రెస్ కసరత్తులు!

2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పూర్తిగా డీలా పడిపోయిన కాంగ్రెస్​ పార్టీకి... మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాలు కొత్త శక్తినిచ్చాయి. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ గణనీయంగా పుంజుకోవడం.. అటు అధిష్ఠానం.. ఇటు కార్యకర్తల్లోనూ నూతన ఉత్సాహం నింపింది. అదే జోరును కొనసాగిస్తూ.. అధికార భాజపాను ఇరుకున పెట్టేందుకు హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి ప్రధాన సమస్యలను ఎత్తిచూపుతూ.. విపక్ష పార్టీలన్నింటితో కలిసి భాజపాపై ఉమ్మడి పోరు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్​ అగ్రనాయకులు.. విపక్ష పార్టీల నేతలతో ఈ మేరకు చర్చించినట్లు సమాచారం.

"మా నాయకులు.. ఇతర విపక్ష పార్టీల నేతలతో మాట్లాడుతున్నారు. రానున్న అయిదు రోజుల్లో వివిధ విపక్ష పార్టీలతో

దిల్లీలో ఉమ్మడి సమావేశాలు నిర్వహించనున్నాం". - కాంగ్రెస్​ సీనియర్​ నేత

ప్రజాస్వామ్య నిరసనలతో పాటు.. రానున్న పార్లమెంటు సమావేశాల్లోనూ ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కార్యాచరణ రచిస్తోంది కాంగ్రెస్. అయితే భాజపాపై పోరాడేందుకు విపక్ష పార్టీలన్నీ ఐకమత్యంగా ఉండాలని కాంగ్రెస్​ నాయకులు పిలుపునిస్తున్నారు.

New Delhi, Oct 30 (ANI): Diwali Milan was organised for all the officers and staff of Prime Minister's Office at Lok Kalyan Marg on October 30. Prime Minister Narendra Modi extended Diwali greetings to everyone.
Last Updated : Oct 31, 2019, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.