ETV Bharat / bharat

'దృఢమైన నాయకుని అవసరం కాంగ్రెస్ వల్లే తెలిసింది'

దేశానికి దృఢమైన నాయకత్వం ఎంత అవసరమో కాంగ్రెస్ బలహీన ప్రభుత్వం ద్వారా తెలిసిందని కేంద్రమంత్రి ప్రతాప్​ చంద్ర సారంగి అన్నారు. యూపీఏ పదేళ్ల పాలన అవినీతిమయమని ఆరోపించారు. లోక్​సభలో రాష్ట్రపతి ప్రసంగంపై తీర్మాన చర్చలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు సారంగి.

'దృఢమైన నాయకత్వం అవసరమని కాంగ్రెస్ వల్లే తెలిసింది'
author img

By

Published : Jun 24, 2019, 4:51 PM IST

యూపీఏ పదేళ్లపాలనలో నిస్సహాయ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆరోపించారు కేంద్రమంత్రి ప్రతాప్​ చంద్ర సారంగి. దేశానికి దృఢమైన నాయకత్వం ఎంత అవసరమో ఆ సమయంలో అనుకోకుండా ప్రధాని అయిన వ్యక్తి పాలన ద్వారా ప్రజలకు తెలిసిందని వ్యాఖ్యానించారు.

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు చర్చ నిర్వహించారు. సారంగి మాట్లాడుతూ కాంగ్రెస్​ పదేళ్ల పాలనపై ధ్వజమెత్తారు. ఆ సమయంలో ఓ వ్యక్తి అనుకోకుండా ప్రధాని అయ్యారని మన్మోహన్​ సింగ్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ పాలన అవినీతిమయమని ఆరోపించారు.

2022నాటికి దేశంలోని పేదలందరికీ కేంద్రం పక్కా ఇల్లు నిర్మిస్తుందని తెలిపారు సారంగి. సాధారణ వ్యక్తిని కేంద్రమంత్రిని చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: 'మన ప్రధానమంత్రి మంచి సేల్స్​మన్​'

Intro:Body:

rr

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.