రక్షణ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీలో.. మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు, భాజపా ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్‌ను ఎంపిక చేయడంపై దుమారం రేగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో.. 21 మంది సభ్యులతో ఏర్పాటయిన ఈ కమిటీలో ప్రగ్యా సింగ్‌ను ఎంపిక చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆమెను ఎంపిక చేయడమంటే.. దేశ సైనిక దళాలను అవమానించడమేనని కాంగ్రెస్ విమర్శించింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి.. తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ప్రగ్యా సింగ్‌ను రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలో ఎంపిక చేయడం పట్ల ట్విట్టర్‌లో కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
" ఉగ్రవాదాన్నివ్యాపిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న ఎంపీకి రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీలో చోటు దక్కడం దేశానికి దురదృష్టకరం. ప్రగ్యాసింగ్‌ను ప్రధాని మోదీ హృదయపూర్వకంగా క్షమించలేదు. అయినా దేశ రక్షణకు సంబంధించిన ముఖ్యమైన కమిటీలో ఆమెకు చోటు దక్కింది. మోదీ ఉంటే ఏదైనా సాధ్యమని అందుకే అంటారు."
- రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఇదీ చూడండి : 'కశ్మీర్ ఆంక్షలపై ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాల్సిందే'