రాహుల్ గాంధీని విమర్శిస్తూ భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ట్వీట్‌కు.. కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రతిస్పందించారు. దేశంలో బంగాళదుంపలకు కనీస మద్దతు ధర లేదనే విషయం తెలుసుకోవాలంటూ నడ్డాకు సూచించారు. అయినా.. ఆలుగడ్డలను విదేశాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామో చెప్పగలరా అని ప్రశ్నించారు.
''నడ్డా జీ! రైతులను తప్పుదోవ పట్టించే ముందు బంగాళదుంపలకు ఎంఎస్పీ లేదనే విషయం తెలుసుకోండి. వ్యవసాయంలో సంస్కరణలు కావాలని మేం కోరుతున్నాం నిజమే. కానీ, అవి రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడేలాగా ఉండొద్దని కోరుతున్నాం.''
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధి.
'దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి పది లక్షల టన్నుల ఆలుగడ్డలను ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం.' ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండని.. నడ్డా ట్వీట్‌ను ట్యాగ్ చేశారు.
రాహుల్ గాంధీ.. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మొదట నడ్డా ఓ వీడియోను ట్వీట్ చేశారు. దానికి బదులుగా సుర్జేవాలా ఈ విధంగా స్పందించారు.
ఇదీ చదవండి: 'అప్పుడలా.. ఇప్పుడిలా.. ఏంటిది రాహుల్ జీ?'