ETV Bharat / bharat

దిల్లీ అల్లర్లపై కాంగ్రెస్​ నిజనిర్ధరణ కమిటీ నివేదిక - Delhi violence latest update

ఈశాన్య దిల్లీలో గత నెలలో చెలరేగిన అల్లర్లపై కాంగ్రెస్​ నిజనిర్ధరణ కమిటీ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నేడు నివేదిక సమర్పించింది. కేంద్ర, దిల్లీ ప్రభుత్వాల వైఫల్యం, భాజపా నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలే హింసాత్మక ఘటనలకు దారితీశాయని నివేదికలో పేర్కొన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Delhi violence
దిల్లీ అల్లర్లపై కాంగ్రెస్​ నిజనిర్ధరణ కమిటీ నివేదిక
author img

By

Published : Mar 9, 2020, 5:02 PM IST

Updated : Mar 9, 2020, 9:14 PM IST

దిల్లీ అల్లర్లపై కాంగ్రెస్​ నిజనిర్ధరణ కమిటీ నివేదిక

పౌరసత్వ చట్ట వ్యతిరేక- అనుకూలవాదుల మధ్య దిల్లీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారటంపై కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నివేదిక సమర్పించింది ఆ పార్టీ నిజనిర్ధరణ కమిటీ. ప్రజల్లో విశ్వాసం నెలకొల్పడంలో కేంద్ర, దిల్లీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని నివేదికలో పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

"దిల్లీ అల్లర్లలో సర్వస్వం కోల్పోయిన వారి సమస్యలను పరిష్కరించటంలో కేంద్ర, దిల్లీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపాయి. పోలీసుల సమక్షంలో కొందరు భాజపా నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటమే అల్లర్లకు కారణం. హింసాత్మక ఘటనలను నిలువరించటంలో దిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు." అని నివేదికలో పేర్కొన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఐదుగురు సభ్యులతో కమిటీ..

పౌరసత్వ చట్టంపై ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లపై నిజానిజాలు తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఇందులో పార్టీ సీనియర్​ నేతలు ముకుల్​ వాస్నిక్​, తారిఖ్​ అన్వర్​, సుశ్మితా దేవ్​, శక్తిసిన్హా గోహిల్​, కుమారి సేల్జాలు ఉన్నారు.

అల్లర్ల ప్రాంతాల్లో పర్యటన

ఈ కమిటీ సభ్యులు ఇటీవల అల్లర్లు చెలరేగిన ఈశాన్య దిల్లీ ప్రాంతాల్లో పర్యటించారు. అల్లర్లలో గాయపడిన బాధితులు, వారి కుటుంబాలను కలిసి పరిస్థితులను తెలుసుకున్నారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన దిల్లీ పోలీసు కానిస్టేబుల్​, ఐబీ అధికారి కుటుంబాలను కలిశారు.

53 మంది మృతి..

గత నెలలో ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. హింసాత్మకంగా మారిన ప్రాంతాల్లో జఫ్రాబాద్​, మౌజ్​పుర్​, ఛాంద్​బాఘ్​, ఖురేజి ఖాస్​, భజన్​పుర ఉన్నాయి.

ఇదీ చూడండి: అన్నదాతకు అప్పుల మోత.. భరోసా ఏదీ?

Last Updated : Mar 9, 2020, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.