పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బుధవారం అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టాలని ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈమేరకు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, పార్టీ సభాపక్షనేతలకు ప్రత్యేకంగా లేఖలు రాశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. లోక్సభలో పాసైన బిల్లును రాజ్యసభలో బుధవారం ప్రవేశపెట్టనున్నందున.. నిరసనలు చేపట్టాలని ఆదేశించారు. బిల్లుపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి.. పార్టీ నిర్ణయానికి మద్దతు కూడగట్టాలని వేణుగోపాల్ తెలిపారు.
బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లలో మతపరమైన హింసకు గురై భారత్కు వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీనిపై కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదీ చూడండి: పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం