ETV Bharat / bharat

ఈవీఎంల భద్రత బాధ్యత ఈసీదే: ప్రణబ్

ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయన్న ఊహాగానాలపై ఆందోళన వ్యక్తం చేశారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల కమిషనే జవాబుదారీగా వ్యవహరించాలని స్పష్టం చేశారు ప్రణబ్​.

ప్రణబ్​ ముఖర్జీ ప్రకటన
author img

By

Published : May 21, 2019, 4:28 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఈవీఎంలలో అవకతవకలు జరిగాయన్న ఊహాగానాలపై స్పందించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల కమిషనే జవాబుదారీగా వ్యవహరించాలన్నారు. అవకతవకలు జరిగాయన్న ఊహాగానాలకు తెరదించి, సంస్థ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ఈసీదేనని స్పష్టం చేశారు.

ప్రజాతీర్పు అవకతవకలకు లోనైందన్న​ ఆరోపణల పట్ల ఆందోళన చెందుతున్నానని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు ప్రణబ్. "ఈవీఎంల భద్రత, ఎన్నికల కమిషన్​ బాధ్యత. ప్రజాస్వామ్యానికి మూలమైన ఎన్నికలపై ఎలాంటి ఊహాగానాలకు ఆస్కారం ఉండటానికి వీల్లేదు. ప్రజాతీర్పే అంతిమం" అని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : గేమ్​ ఆఫ్ థ్రోన్స్​, బీబర్​తో ప్రకృతికి ముప్పు!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.