ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భక్తులు లేకుండానే రథయాత్ర కార్యక్రమాన్ని సంప్రదాయం ప్రకారం అర్చకులు, ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు.
- ఉదయం 3 గంటలకు మంగళహారతితో రథయాత్ర కార్యక్రమం ప్రారంభమైంది.
- అనంతరం మైలమ, తడపలాగి సేవలు నిర్వహించారు.
- నాలుగున్నర గంటలకు అబకాష, ఉదయం అయిదున్నర గంటలకు సకల ధూప కార్యక్రమాన్ని చేపట్టారు.
- 6 గంటల 45 నిమిషాలకు రథ ప్రతిష్ట చేశారు.
- ఆ తర్వాత పహండి, మదన్ మోహన్ బిజే, చిత్త లాగి కార్యక్రమాలు నిర్వహించారు.
- ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన చేరా పన్హారా కార్యక్రమం 11 గంటల 30 నిమిషాలకు నిర్వహిస్తారు.
- మధ్యాహ్నం 12.30కు రథయాత్ర ప్రారంభం అవుతుంది.