ETV Bharat / bharat

కరోనా పోరులో భారత్​కు కోకాకోలా రూ.100 కోట్ల సాయం - cocacola help to india

కరోనా వైరస్​పై పోరాటంలో భారత్​కు బాసటగా నిలిచింది కోకాకోలా సంస్థ. రూ. 100 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మొత్తాన్ని పేదలకు వైద్య సదుపాయం, నీటి వసతి కల్పించేందుకు ఖర్చు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

cocacola
కరోనాపై పోరులో కోకాకోలా
author img

By

Published : Apr 28, 2020, 7:11 PM IST

కరోనాపై పోరులో భారత్​కు రూ.100 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకువచ్చింది కోకాకోలా. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో పేదలకు వైద్య సదుపాయం, నీటి వసతి కల్పించేందుకు ఈ నిధులను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది.

యునైటెడ్ వే, కేర్​ ఇండియా సామాజిక సంస్థలతో కలసి ఆరోగ్య, ఆహార భద్రత దిశగా భారత్​లో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ దిశగా ఇప్పటికే అక్షయపాత్ర ఫౌండేషన్, వనరయి, చింతన్, హసిరుదలా, మంతన్ సంస్థాన్, అమెరికన్ ఇండియా ఫౌండేషన్​లతో కలిసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పేదలకు ఆహారం, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు, కరోనా రక్షణ సామగ్రి, ఔషధాలు అందిస్తున్నట్లు తెలిపింది.

ఉద్యోగుల ద్వారా..

తమ ఉద్యోగుల నుంచి 'గివ్ ఇండియా' కార్యక్రమం ద్వారా నిధులు సేకరించి.. చెత్త ఏరుకుని జీవనం సాగించేవారికి ఆహారం, శానిటైజర్లు వంటివి అందిస్తున్నట్లు తెలిపింది కోకాకోలా. ఉద్యోగులు ఇచ్చిన మొత్తానికి సమానంగా తాము కూడా ఈ నిధికి కలిపి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: వలస కష్టం: కాలి నడకన 2 వేల కి.మీ ప్రయాణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.