ETV Bharat / bharat

కరోనా భయంతో విమానం నుంచి కిందకు దూకిన పైలట్ - co pilot of air asia jump of from sliding window

co pilot
కరోనా భయంతో విమానం నుంచి కిందకు దూకిన పైలట్
author img

By

Published : Mar 23, 2020, 11:59 AM IST

Updated : Mar 23, 2020, 12:30 PM IST

12:19 March 23

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయాలు నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలకు అద్దంపట్టే ఘటన దిల్లీ విమానాశ్రయం వేదికగా జరిగింది. విమానంలో కరోనా బాధితుడు ఉన్నాడన్న సమాచారం ప్రయాణికుల్లో వ్యాపించింది. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన విమాన కో పైలట్.. కిందకు దూకాడు.

పుణె నుంచి దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ ఏషియా విమానంలోని ఓ ప్రయాణికుడు కరోనా అనుమానితుడని మరో వ్యక్తికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికుల్లో గందరగోళం తలెత్తింది. విమానంలోని వారు ఆందోళనకు లోనయ్యారు. అయితే విమానం నుంచి సాధారణ మార్గం ద్వారా కిందకు దిగాల్సి ఉండగా.. కో-పైలట్ కాక్​పిట్ పక్కనుంచే స్లైడింగ్ విండో ద్వారా కిందకు దూకాడు. ఈ ఘటన దిల్లీ విమానాశ్రయంలో చర్చకు దారి తీసింది. అదే సమయంలో అనుమానితుడు ప్రయాణించిన విమానాన్ని రన్​వేపై వేరుగా నిలిపి ఉంచారు.

ప్రయాణికుల్లో నెలకొన్న ఆందోళనను పరిగణనలోకి తీసుకుని అనుమానితుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే వైద్య పరీక్షల్లో అతడికి కరోనా లేదని తేలింది. 

ఇదీ చూడండి: లాక్​డౌన్​ను లెక్కచేయని ప్రజలు- మార్కెట్లు రద్దీ

11:48 March 23

విమానంలో కరోనా బాధితుడు ఉన్నాడన్న సమాచారంతో కిందకు దూకాడు ఓ పైలట్. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. పుణె నుంచి దిల్లీకి చేరుకున్న విమానంలో వైరస్ అనుమానితుడు ఉన్నాడని ప్రయాణికుల్లో వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విమానం నుంచి సాధారణ మార్గంలో బయటకు రాకుండా కిందకు దూకాడు సహ పైలట్.

Last Updated : Mar 23, 2020, 12:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.