దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యారు. గొంతునొప్పి, సాధారణ జ్వరంతో బాధపడుతున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉన్న ఆయనకు మంగళవారం.. కరోనా టెస్టులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
సీఎం ఇప్పటికే డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం కేబినెట్ భేటీ అనంతరం అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా.. 2 నెలలుగా ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే సమీక్షలు నిర్వహిస్తున్నారు దిల్లీ ముఖ్యమంత్రి.