1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 36 ఏళ్లు. ఈ సందర్భంగా మృతులకు నివాళి అర్పించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం.. స్మారక చిహ్నం నిర్మిస్తామని ప్రకటించారు. ప్రపంచంలోని ఏ నగరమూ మరో భోపాల్లా మారకూడదని ఈ స్మారకం గుర్తుచేస్తుందని ఆయన అన్నారు.
![CM Chouhan pays tribute to victims of Bhopal gas tragedy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9753499_92.jpg)
అప్పటి ప్రమాదంలో తమ భర్తలను కోల్పోయిన మహిళలకు రూ.1000 చొప్పున పింఛను ఇచ్చే పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు శివరాజ్.
''1984 డిసెంబర్ 2-3 తేదీల్లో జరిగిన దుర్ఘటనలో విషవాయువు వెలువడి ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకంగా.. స్మారక చిహ్నం నిర్మిస్తాం. 2019లో (కాంగ్రెస్ హయాంలో) వితంతువులకు పింఛను నిలిపివేశారు. దానిని పునరుద్ధరిస్తాం.''
- శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
ఆనాటి భోపాల్ దుర్ఘటనలో మిథైైల్ ఐసోసైనేట్ రసాయనం వెలువడి.. 15 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 5 లక్షలమందికిపైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. వీరిలో చాలా మంది ఇప్పుడు కరోనా కారణంగా చనిపోతున్నారు. భోపాల్‌లో కొవిడ్‌తో ఇప్పటివరకు 518 మంది మరణించగా.. అందులో 102 మంది భోపాల్ దుర్ఘటన బాధితులే.
ఇదీ చూడండి: భోపాల్ విషాదాన్ని ఎదుర్కొని.. కొవిడ్‌తో ఓటమి!
ఇదీ చూడండి: భోపాల్ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్ లీక్లెన్నో...
బాధితుల నిరసనలు..
![CM Chouhan pays tribute to victims of Bhopal gas tragedy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9753499_21.jpg)
![CM Chouhan pays tribute to victims of Bhopal gas tragedy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9753499_45.jpg)
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి 36 ఏళ్లయిన సందర్భంగా.. బాధితులు, వారి కుటుంబసభ్యులు ఆందోళనలు నిర్వహించారు. డౌ కెమికల్ ఛైర్మన్, సీఈఓ జిమ్ ఫిట్టర్లిన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. భోపాల్‌కు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, డౌ కెమికల్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![CM Chouhan pays tribute to victims of Bhopal gas tragedy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9753499_2.jpg)
ఇదీ చూడండి: నేటికీ వెంటాడుతున్న భోపాల్ పాపాల్