అసోంలో జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్ఆర్సీ)పై అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సమర్థించారు. ఇది భవిష్యత్‌లో ఆధార పత్రంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ఆర్సీ ఎంతో ఆవశ్యకమైనదిగా పేర్కొన్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ మృణాల్ తాలూక్దార్ రచించిన 'పోస్ట్ కలోనియల్ అసోం' పుస్తకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న జస్టిస్ గొగొయ్.. అక్రమ వలసదారుల సంఖ్యపై గతంలో అనుసరించిన విధానం వల్లే హింస చెలరేగిందని అభిప్రాయపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు ఎన్ఆర్సీపై బాధ్యతా రహితమైన వార్తలు ప్రచురిస్తూ అసోం పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుత ఎన్ఆర్సీ 1951 నాటి జాతీయ పౌరసత్వ జాబితాకు కొత్తరూపుగా అభివర్ణించారు జస్టిస్ గొగొయ్.
ఇదీ చూడండి: ఎన్సీపీ నేతకు శివసేన సందేశం..మద్దతు కోసమా?