జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లా దదూరా-కంగన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ పౌరుడి ఇంటిపై దాడి చేసి తుపాకులతో కాల్చి చంపారు. శనివారం రాత్రి 9:40 గంటలకు ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి పేరు అజాద్ అహ్మద్ దార్ అని వెల్లడించారు.
అయితే ఉగ్రవాదాలు పౌరుడ్ని లక్ష్యంగా చేసుకుని ఎందుకు దాడి చేశారనే విషయం తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.