ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి కత్రా కేశవ్దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న 17వ శతాబ్దం నాటి ఈద్గాను తొలగించాలని కోరుతూ ఐదుగురు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రంజనా అగ్నిహోత్రి, పర్వేశ్ కుమార్, రాజేశ్ మణిత్రిపాఠి, కరుణేశ్ కుమార్ శుక్లా, శివాజీ సింగ్, త్రిపురరీ తివారీ ఇక్కడి జిల్లా న్యాయస్థానంలో శనివారం పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుపై సోమవారం ఉదయం న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ కేసులో యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, షాహీ మస్జిద్ ఈద్గా నిర్వహణ కమిటీలతో పాటు శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్(మథుర), శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్‌లను కూడా ప్రతివాదులుగా పిటిషనర్లు చేర్చారు.
శ్రీకృష్ణ జన్మభూమి మొత్తం 13.70 ఎకరాల భూమిలో ఉంది. మసీదు నుంచి ఆలయాన్ని వేరు చేసేందుకు ఉద్యమం చేపడతామని హిందూ ఆర్మీ చీఫ్ సంగథన్ హెచ్చరించింది. అనంతరం సంగథన్ అధ్యక్షుడు మనీశ్ యాదవ్‌తో పాటు మరో 21మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చూడండి:- రామమందిర నిర్మాణం.. 2024 ఎన్నికల వ్యూహమేనా?