"అసలే కరోనా వచ్చింది... ఆసుపత్రికి వస్తే కనికరం లేకుండా ఓ మూటగట్టి వార్డ్కు మోసుకెళ్తున్నారు. ఇదేం చిత్రం బాబూ!"... ఇదీ మహారాష్ట్ర నాసిక్ జిల్లా ఆసుపత్రిలో కరోనా రోగి ఆవేదన. ఆసుపత్రిలో లిఫ్ట్ సరిగా పనిచేయడం లేదని కరోనా రోగులను ఇలా ఓ మూటగట్టి దుప్పటిలో మోసుకొని మెట్లపై నుంచి వార్డుకు తీసుకువెళ్తున్నారు సిబ్బంది. ఈ విషయంపై ఆసుపత్రి వైద్యుడు డా. నీలేశ్ జెజుకర్ను 'ఈటీవీ భారత్' సంప్రదించగా కొద్ది రోజులుగా ఎలివేటర్ సమస్య ఉందని, వెంటనే పరిష్కరిస్తామని బదులిచ్చారు.
కరోనా కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి ఆసుపత్రులకు రోజూ వందల కేసులు వస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు లేకపోవడం గమనార్హం.