ETV Bharat / bharat

త్వరలో ఆహార పదార్థంగా 'ఆల్గే' - ఆల్గే ఆహారం

'ఆల్గే' అంటే ఒక శైవలం అని మాత్రమే తెలుసు. ఆల్గేను త్వరలో ఆహార పదార్థంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. శరీర వృద్ధికి తోడ్పడే ఈ మేలు రకం శైవలాన్ని.. విదేశీయులు విస్తృతంగా వాడుతున్నారు. అయితే.. ఈ ఆల్గే వల్ల ఉపయోగాలేంటి? దాని వల్ల శరీరానికి ప్రయోజనమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం...

CIMFR SCIENTISTS TO MAKE ALGAE PART OF THE HUMAN DIET
త్వరలో ఆహార పదార్థంగా 'ఆల్గే'
author img

By

Published : Dec 14, 2020, 8:03 AM IST

Updated : Dec 14, 2020, 8:14 AM IST

త్వరలో ఆహార పదార్థంగా 'ఆల్గే'

మైనింగ్, ఇంధనాల పరిశోధన సంస్థ సీఐఎంఎఫ్​ఆర్​లోని శాస్త్రవేత్తలు ఆల్గే నుంచి ఆహార పదార్థాలు తయారుచేసే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. కుంటలు, జలాశయాలు, నదుల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. వేర్లతో కాకుండా, మొలకెత్తి, కొమ్మలు,ఆకులతో పెరుగుతుంది. కొన్నిరకాల ఆల్గే హానికరమైనదే అయినా.. మరికొన్ని రకాల శైవలాలు ఆహారంలో, ఔషధాలు, వ్యవసాయంలో ఉపయోగపడుతాయి.

"ఆల్గే ఓ అందమైన జీవి. దాని నుంచి మన కోసం ఎన్నో ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఆహారం, ఇంధనం, ఔషధాలు, ఎరువులు, కాస్మొటిక్స్... ఇంకా ఎన్నో ఉత్పత్తులు ఆల్గే నుంచే తయారవుతాయి."

- డా. అంగు సెల్వి, శాస్త్రవేత్త, సీఐఎంఎఫ్ఆర్

పోషకాలివే..

ఆల్గేలో ప్రొటీన్​తో పాటు కార్బొహైడ్రేట్లు, విటమిన్ల లాంటి ఎన్నో పోషకాలుంటాయి. రానున్న రెండేళ్లలో శైవలాల నుంచి ఆహారోత్పత్తులు తయారుచేసే ప్రాజెక్టుపై ధన్బాద్లోని దిగ్వాదిలో ఉన్న సీఐఎంఎఫ్​ఆర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు.

"ఆల్గే నుంచి ఆహారోత్పత్తులు తయారుచేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఏడాది పాటు ఈ ప్రాజెక్టుపై పరిశోధన కొనసాగిస్తాం. వచ్చే ఏడాది నుంచి దీన్ని మార్కెట్లోకి తేవాలని భావిస్తున్నాం."

"మనకు మంచి ప్రొటీన్ల అవసరం చాలా ఉంటుంది. ఆహారం ద్వారా కావల్సిన మోతాదులో ప్రొటీన్ తీసుకోకపోతే.. అదనంగా వేరే రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్లు చేపట్టిన ప్రాజెక్టు చాలా మంచిది. కానీ ధర, రుచి అన్నింటికన్నా ముఖ్యమైనవి."

- డా. సాధన, వైద్యురాలు

వాటి నుంచి వేరుగా..

ఇందుకోసం ఆల్గేని.. శరీరానికి హాని కలిగించే ఇతర పదార్థాల నుంచి వేరుచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆ పని పూర్తైతే.. దాని నుంచి పోషకాలను తీసుకుని, ఆహారోత్పత్తులు తయారు చేస్తారు. మాత్రలు, పొడి, క్యాప్సూల్స్ రూపంలో వీటిని తయారుచేయడం వల్ల ప్రజలకు సులభంగా చేరువ చేయొచ్చని భావిస్తున్నారు.

"చాలా రకాలుగా దీన్ని వినియోగించుకోవచ్చు, పొడిగానైనా వాడుకోవచ్చు, మాత్రలు, ద్రవాలు, బిస్కెట్ల రూపంలోనూ తీసుకోవచ్చు."

పూర్తిగా శాకాహారమే..

ఆల్గే నుంచి తయారయే ఆహారం పూర్తిగా శాకాహారం. పేదప్రజలు కూడా కొనగలిగేలా తక్కువ ధరకే వీటిని అందుబాటులోకి తేనున్నారు. పోషకాహార లేమిని అధిగమించేందుకు ఆల్గే ఆహారోత్పత్తులు దోహదపడతాయన్నది పరిశోధనకారులు చెప్తున్న మాట. శైవలాల పెంపకంపై రైతులకు శిక్షణనిచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగానూ ప్రయోగాలు చేస్తున్నారు.

"ఆల్గే నుంచి తయారుచేసిన ఈ రకమైన పోషకాహారం పెద్దవయసు వాళ్లకు చాలా మంచిది. పిల్లలు, మహిళలు కూడా తీసుకోవచ్చు."

విదేశాల్లో ఇప్పటికే వినియోగంలో..

చైనా, జపాన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇప్పటికే శైవలాలను ఆహార పదార్థాల్లో వినియోగిస్తున్నారు. అంతకంతకూ పెరుగుతున్న ఆహార సమస్యను అధిగమించాలంటే ఇలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రయత్నం సఫలీకృతమైతే.. మన రోజువారీ ఆహారంలో ఆల్గే ఓ భాగంగా మారేందుకు ఎంతో సమయం పట్టదు.

ఇదీ చదవండి: రోజూ ఒక గుడ్డు ఎందుకు తినాలంటే.?

Last Updated : Dec 14, 2020, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.