శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో మరోమారు సుప్రీంను ఆశ్రయించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ స్కామ్లో భాగస్వాములైన వారందరూ పట్టుబడాలంటే కోల్కతా కమిషనర్ రాజీవ్ కుమార్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. సీబీఐ అభ్యర్థనపై రాజీవ్ కుమార్ 4 వారాల్లోగా స్పందించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం రాజీవ్ కుమార్కు నోటీసులు జారీ చేసింది.
"రోజ్ వ్యాలీ పోంజీ, శారదా కుంభకోణాలకు పాల్పడ్డ వారందరినీ కనిపెట్టాలంటే... రాజీవ్ కుమార్ను అరెస్ట్ చేయకుండా ఫిబ్రవరి 5న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పునః పరిశీలించాల్సిన అవసరముంది. పశ్చిమ్ బంగ రాష్ట్రాధికారులు దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకి సృష్టించకుండా, సీబీఐ అధికారులను బెదిరించకుండా కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకునేలా ఆదేశాలివ్వండి."
-సీబీఐ