ETV Bharat / bharat

భాజపా X కాంగ్రెస్​: వైఫల్యమా? పైశాచికత్వమా? - రాహుల్ గాంధీ

భారత్-చైనా వివాదంతో దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలకు మించి అధికార భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ వర్కింగ్​ కమిటీ వేదికగా ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. భాజపా పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ విమర్శల్ని కమలదళం దీటుగా తిప్పికొట్టింది.

bjp-rahul
భాజపా, కాంగ్రెస్
author img

By

Published : Jun 23, 2020, 6:26 PM IST

చైనాతో సరిహద్దు వివాదంపై అధికార భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. చైనాతో ఉద్రిక్తతలకు సంబంధించి తాజాగా మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.

కాంగ్రెస్​ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రసంగించిన రాహుల్​.. విదేశాంగ విధానంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.

"భారత్​లో వ్యవస్థీకృతమైన సంస్థాగత దౌత్య విధాన నిర్మాణాన్ని ప్రధాని కూల్చివేశారు. ఒకప్పుడు పొరుగువారితో స్నేహపూర్వకంగా ఉన్న మన సంబంధాల్లో గందరగోళం తలెత్తింది. ఈ కాలపరీక్షలో మన చిరకాల మిత్రులతో సంబంధానికి అంతరాయం కలిగింది. చైనా మన భూభాగాన్ని నిర్భయంగా ఆక్రమించింది. కానీ భారత భూభాగాన్ని ఆక్రమించలేదని చైనా చేసిన వాదనను అంగీకరిస్తూ సైన్యాన్ని ప్రధాని మోసం చేశారు."

- రాహుల్ గాంధీ

చైనా చర్యలు ఆమోద్య యోగ్యం కాదని పేర్కొన్న రాహుల్​.. సైనికుల ప్రాణత్యాగాలకు వృథా కానివ్వరాదని అన్నారు. అమెరికాతో పాటు ఇతర దేశాలతోనూ భారత్ మంచి సంబంధాలు నెరపాలని సూచించారు గాంధీ. పాత మిత్రులతోనూ స్నేహాన్ని కొనసాగించాలన్నారు.

మోదీ విధానాలే కారణం..

అంతకముందు దేశంలో ప్రతి సంక్షోభానికి మోదీ ప్రభుత్వ విధానాలే కారణం అని ఆరోపించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.

"ప్రస్తుతం దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చైనా - భారత్ మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. ప్రతి సంక్షోభానికి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలే కారణం. ప్రపంచవ్యాప్తంగా ముడి చుమురు ధరలు పడిపోతున్నా.. వరుసగా 17 రోజులుగా ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరిచారు. అధికార యంత్రాంగం అంతా.. చేతుల్లో ఉన్నా మహమ్మారి విజృంభణను కట్టడి చేయడంలో మోదీ విఫలమయ్యారు."

- సోనియా గాంధీ

సమావేశంలో.. సోనియా వ్యాఖ్యలకు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ మద్దతు పలికారు. సరిహద్దు సంక్షోభం ఇలాగే కొనసాగితే దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

భాజపా ఎదురుదాడి

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెబుతూ కాంగ్రెస్ 'పైశాచిక ఆనందం' పొందుతోందని భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోజూ భారత్​ ఓడిపోతోంది, సైన్యం లొంగిపోయింది, ప్రధాని బలహీనుడు అంటూ విరుద్ధ వాదనలు చేస్తోందని అన్నారు. భారత్​లో ఒక్క అంగుళం భూమిని కూడా పొరుగు దేశం ఆక్రమించలేదని స్పష్టం చేశారు సంబిత్.

ఇదీ చూడండి: నడ్డా- రాహుల్​ మధ్య 'చైనా' వార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.