ETV Bharat / bharat

తూర్పు లద్దాఖ్​ పరిస్థితులపై సీఎస్​జీ సమీక్ష - india china border disputes news

తూర్పు లద్దాఖ్​లోని ఫింగర్​ ఏరియా నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు చైనా ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో సరిహద్దులో పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది చైనా అధ్యయన బృందం (సీఎస్​జీ). విదేశాంగ మంత్రి ఎస్ జయ్​శంకర్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​, ఇతర అధికారులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.

china-study-group-discusses-eastern-ladakh-situation-india-firm-on-complete-disengagement-by-china
తూర్పు లద్దాఖ్​ పరిస్థితులపై చైనా అధ్యయన బృందం సమీక్ష
author img

By

Published : Aug 1, 2020, 10:21 PM IST

తూర్పు లద్దాఖ్​లో పరిస్థితిపై చర్చించేందుకు చైనా అధ్యయన బృందం (సీఎస్​జీ) జులై 28న సమావేశమైంది. ఫింగర్​ ఏరియా నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు చైనా ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని భేటీలో చర్చించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్​ జయ్​శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​, సైన్యాధికారులు, ప్రభుత్వ సంస్థలకు చెందిన ఇతర అధికారులు సీఎస్​జీలో సభ్యులుగా ఉన్నారు.

గత చర్చల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం తూర్పులద్దాఖ్​లోని అన్ని ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను కచ్చితంగా ఉపసంహరించుకోవాల్సిందేనని సీఎస్​జీ భేటీలో నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

భారత్​- చైనా మధ్య జులై 15న జరిగిన కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చల అనంతరం సరిహద్దులో బలగాల ఉపసంహరణ ప్రక్రియను ఇరు దేశాలు ప్రారంభించాయి. ఫింగర్​ ప్రాంతాల నుంచి కూడా బలగాల ఉపసంహరణ ప్రారంభించిన చైనా.. రెండు రోజుల తర్వాత ఆపేసింది. నాలుగు పెట్రోలింగ్​ పాయింట్ల వద్ద బలగాలను అలానే ఉంచింది. భారత్​ కూడా ఆ ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోలేదు.

ఈ ప్రక్రియను చైనా పూర్తి చేయాలని భారత్ ఇప్పటికే తేల్చిచెప్పింది.

ఇదీ చూడండి: 'మహా'లో శాంతించని కరోనా.. కొత్తగా 9,601 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.