ETV Bharat / bharat

మోదీ ఎఫెక్ట్​: భారత్​తో చర్చలకు చైనా సిద్ధం

విభేదాలపై అవగాహన పెంచుకుని, ద్వైపాక్షిక బంధాన్ని పెంపొందించుకునేే విధంగా భారత్​తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. భారత ప్రధాని మోదీ స్వాతంతర్య దినోత్సవ ప్రసంగం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

China says ready to properly address differences with India
మోదీ ఎఫెక్ట్​: భారత్​తో చర్చలకు చైనా సిద్ధం
author img

By

Published : Aug 17, 2020, 4:44 PM IST

రాజకీయంగా పరస్పర నమ్మకాన్ని పెంపొందించుకుని, విభేదాలపై సరైన అవగాహన పెంచుకుని, దీర్ఘకాలం పాటు ద్వైపాక్షిక బంధాన్ని భద్రపరుచుకునేందుకు భారత్​తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. దేశా సౌర్వభౌమాధికారాన్ని ప్రశ్నించిన పాకిస్థాన్​, చైనాకు తమ జవాన్లు గుణపాఠం చెప్పారని.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది.

"రెండు పొరుగు దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే కాక ఈ ప్రాంతంలో స్థిరత్వం, శాంతి, శ్రేయస్సును పెంపొందిస్తుంది. దీర్ఘకాలిక లక్షాలను గౌరవించి మద్దతునివ్వడం ఇరు దేశాలకు మంచిది. అందువల్ల.. రాజకీయంగా పరస్పర నమ్మకాన్ని పెంపొందించుకుని, ద్వైపాక్షిక సంబంధాలను సుదృఢం చేసుకోవడానికి భారత్​తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉంది."

--- జావో, చైనా విదేశాంగశాఖ ప్రతినిధి.

ఈ ఏడాది మే నెల నుంచి భారత్​-చైనా సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణ కొనసాగుతోంది. ముఖ్యంగా జూన్​ 15న గల్వాన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘటనతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. పరిస్థితిని అదుపుచేసేందుకు ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోకి చొరబడే వారికి.. ఎల్​ఓసీ నుంచి ఎల్​ఏసీ వరకు భారత జవాన్లు ధీటైన సమాధానం ఇచ్చి గుణపాఠం నేర్పారని పేర్కొన్నారు మోదీ.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.