మాల్దీవులు స్పీకర్, మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్.. చైనా వ్యతిరేక వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్, విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ చైనాకు కోపం తెప్పించని రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా కాకుండా.. చైనాపై పరుషంగా స్పందించారు నషీద్. చైనా ఆక్రమణను ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చారు. అనేక ఏళ్లు ప్రవాసంలో ఉన్న ఆయన 2018 ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. అయితే ఆయన పార్టీ ఎండీపీ తరఫున సోలిహ్‌ను అధ్యక్షుడిగా బరిలో దించారు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. నషీద్ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా భారత్‌కు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో సంభాషించారు. రుణం, అభివృద్ధి సహాయం విషయంలో చిన్నదేశాలు అప్పుల్లో కూరుకుపోయే విధానాలను డ్రాగన్ దేశం అవలంబిస్తోందని అభిప్రాయపడ్డారు నషీద్. చైనా రుణ విధానాలను సమీక్షించాలని వ్యాఖ్యానించారు. తమది చిన్నదేశమే అయినప్పటికీ హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా ప్రధానమైనదని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.
"ఈస్ట్ ఇండియా కంటే ఎక్కువగా చైనా దురాక్రమించింది. అభివృద్ధి కోసం మాకు ఎలాంటి సహాయం వారు చేయలేదు. అదొక రుణాల ఉచ్చు. ప్రస్తుతం మనం ఒప్పందం కుదుర్చుకోవాలి. దీనిని మనం ఆపలేము. మనం అప్పులు చెల్లించాల్సిందే. అయితే చైనా ప్రభుత్వం వారి రుణ విధానాన్ని సమీక్షించాల్సిందే."
-మహ్మద్ నషీద్, మాల్దీవులు స్పీకర్
పర్యటక రంగంపై ప్రధానంగా ఆధారపడిన తమదేశం చైనాకు 3.5 బిలియన్ డాలర్లను రుణపడి ఉన్నట్లు వెల్లడించారు. ఇంతకుముందు పాలించిన నియంతృత్వ అధ్యక్షుడు యమీన్ పాలనలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఖర్చయిందని స్పష్టం చేశారు.
"రుణాలు తిరిగి చెల్లించడం అసాధ్యం. డబ్బు ఎప్పుడూ మాకు రాలేదు. కానీ మేం చెల్లించడానికి పెద్ద బిల్లు ఉంది. మేం దానిని చెల్లిస్తాం. మాల్దీవుల్లోని చాలామంది రాజకీయనాయకులు దీనిని చెల్లించరు."
-చైనాతో రుణాలపై నషీద్
ప్రజాస్వామ్యయుతంగా మొట్టమొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నషీద్ తనను... నాడు తిరుగుబాటు పేరుతో బహిష్కరించడాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాలు చేశారు. రుణ విధానాన్ని చైనా మార్చుకోకపోతే మాల్దీవులు మానవ హక్కుల అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి వెళ్లేందుకు కోర్టు అవకాశం కల్పించింది.
నియంతృత్వ అధ్యక్షుడు యమీన్ పాలనలో ఎలాంటి విపక్షం లేని సమయంలో చేసిన సులభతర వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
"చైనాతో చేసిన సులభతర వాణిజ్య ఒప్పందం మృతస్థితిలో ఉంది. అది పార్లమెంట్ అంగీకారం పొందాలి. కానీ పొందలేదు. చైనా సామ్రాజ్యవాదం, వలసవాదం, భూదురాక్రమణను చూశాం."
-వాణిజ్య అంశాలపై నషీద్
చైనాపై నషీద్ పరుషవ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ మాల్దీవులు అధ్యక్షుడు చైనాకు, భారత్‌కు మధ్య సంబంధాల్లో ఆచితూచి వ్యవహరించడంపై అడిగిన ప్రశ్నకు అంతర్గతంగా ఉన్న భేదాభిప్రాయాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు నషీద్. తాను పరిస్థితులను చూసి నిరుత్సాహానికి గురికానని అయితే బయటకు కనిపించేదానికి భిన్నంగా వాస్తవ రాజకీయాలు ఉంటాయని స్పష్టం చేశారు.
అంతకుముందు ప్రధానితో సమావేశంలో భారత్ చేయబోయే 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయంలో భాగంగా వేగమంతమైన అభివృద్ధి పనులు చేయాలని కోరారు. తన పార్లమెంట్ సహచరులతో కలసి భారత్‌కు విచ్చేసిన ఆయన హింసాత్మక ఇస్లాం, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం, అల్‌ఖైదా ఉగ్రసంస్థలు మాల్దీవులకు విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లలో 250మంది మాల్దీవుల పౌరులు ఇస్లామిక్ స్టేట్‌లో చేరి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వివాదాస్పద మత భోదకుడు జకీర్ నాయక్‌కు మలేసియా ఆశ్రయం కల్పించడంపై ఆందోళన వ్యక్తం చేశారు నషీద్. భారత్ తమకు అప్పగించాలని కోరుతున్న జకీర్‌కు మాల్దీవుల్లో అనుమతి నిరాకరించామన్నారు.
పౌరసత్వ చట్ట సవరణపై భారత్‌కు అనుకూల వ్యాఖ్యలు చేశారు నషీద్.
"పౌరసత్వ చట్ట సవరణ భారత అంతర్గత విషయం. అది మాకు ఏవిధంగానూ సంబంధం లేనిది. మాకు భారత ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది. మీ పార్లమెంట్ ఏదైనా చేస్తే అది సరైన ప్రక్రియ ద్వారానే ముందుకెళ్తుంది."
- నషీద్
సార్క్ కూటమి భవిష్యత్తు అగమ్యగోచరంలో పడిన స్థితిలో మరో ప్రాంతీయ సహకార వేదిక అవసరమని పేర్కొన్నారు నషీద్. మాల్దీవులు వేదికగా తదుపరి సార్క్ శిఖరాగ్ర సమావేశం జరగాలని ఆకాంక్షించారు.
2016లో ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ నేతృత్వంలో సార్క్ శిఖరాగ్ర సదస్సును సభ్యదేశాలు బహిష్కరించాయి.
"ఇది కొనసాగించడానికి చాలా కష్టం. ప్రాంతీయ సహకారానికి మరో ప్రత్యామ్నాయం మనం ఏర్పాటు చేసుకోవాలి. మాల్దీవుల్లో అన్ని సమావేశాలు జరిగితేనే రాబోయే శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తాం. ప్రతి నేతా వెళ్లేందుకు ఇష్టపడే తటస్థ వేదికను కనుగొనడం కష్టమే. సార్క్‌పై తీవ్రంగా ఆలోచించాల్సిందే. దానిపై పరిశీలన చేసి ఏమి చేయవచ్చో ఆలోచించాలి."
-సార్క్‌పై నషీద్