ETV Bharat / bharat

చైనా దుర్నీతి- చర్చలు అంటూనే బలగాల మోహరింపు

author img

By

Published : Jun 24, 2020, 6:48 PM IST

సరిహద్దు వెంట దూకుడు ప్రదర్శిస్తూ వక్రబుద్ధిని చాటుకుంటోంది చైనా. బలగాల ఉపసంహరణకు ఇరుదేశాల మధ్య సైనిక కమాండర్లు, విదేశాంగ మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతుండగానే వాస్తవాధీన రేఖ వెంట బలగాలను మోహరిస్తోంది.

china
చర్చలు సాగిస్తూనే.. బలగాలను మోహరిస్తున్న చైనా

సరిహద్దు వెంట బలగాల ఉపసంహరణ దిశగా చర్చలు జరుగుతుండగానే వాస్తవాధీన రేఖ వెంట సైనిక మోహరింపులు చేస్తోంది చైనా. సరిహద్దు వెంట సైనిక నిర్మాణాలు చేపడుతోంది. పాంగాంగ్ సరస్సు వద్దనున్న ఫింగర్లలో ఇప్పటికే పట్టును పెంచుకున్న చైనా.. సరిహద్దులోని ఇతర ప్రాంతాలకూ బలగాలను విస్తరిస్తోంది. మే 4 నుంచి ఇప్పటివరకు భారీ సంఖ్యలో శతఘ్నులు, సైనిక దళాలను సరిహద్దుకు తరలించింది.

'పాంగాంగ్ సో సరస్సు వెంట సైనిక కార్యకలాపాలను చైనా కొనసాగిస్తోంది. బలగాల తరలింపు, రక్షణ నిర్మాణాలు చేపడుతోంది' అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఫింగర్లపై పట్టుకు యత్నం..

పాంగాంగ్ సరస్సులోని ఫింగర్ 8 వరకు తమదేనని భారత్​ చెబుతోంది. అయితే ఇటీవల జరిగిన సరిహద్దు ఘర్షణలో భారత జవాన్లను ఫింగర్ 4 దాటి పైకి వెళ్లకుండా అడ్డుకుంది చైనా సైన్యం. (పాంగాంగ్​ సరస్సులో ముందుకు చొచ్చుకువెళ్లిన భూభాగాలను ఫింగర్లుగా వ్యవహరిస్తారు. ఇలా చొచ్చుకెళ్లిన భూభాగాలు సరస్సులో 8 ఉన్నాయి.) కొత్త ప్రాంతాలు, ఫింగర్లను తమ పరిధిలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది చైనా. ఇందులో భాగంగానే దూకుడు విధానాలను అవలంబిస్తోంది.

కొనసాగుతున్న బలగాల తరలింపు..

గల్వాన్​ వద్ద ఘర్షణ జరిగిన అనంతరమూ పలు సైనిక నిర్మాణాలను చైనా చేపట్టిందని సమాచారం. జూన్ 15, 16 రాత్రి.. భారత బలగాలు తొలగించిన సైనిక పోస్ట్​లను కూడా పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద చైనా సైన్యం తిరిగి ఏర్పాటు చేసిందని తెలుస్తోంది.

భారత గస్తీ యథాతథం..

భారత్​ కూడా 15, 17, 17ఏ పాట్రోలింగ్ పాయింట్ల వద్ద గస్తీని కొనసాగిస్తోందని తెలుస్తోంది. సరిహద్దు వద్దనున్న ఓ రహదారిని వినియోగిస్తూ భారత పోస్ట్​ల దిశగా సైనికులు, ఆయుధ సామగ్రి తరలింపు చేపడుతున్నట్లు సమాచారం. దౌలత్ బేగ్ ఓల్డీ సెక్టార్ సమీపంలోని పెట్రోలింగ్ పాయింట్ 10, 13 వద్ద సమస్యలు సృష్టించేందుకు చైనా యత్నిస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

వైమానిక దళాన్ని సన్నద్ధం చేస్తోన్న డ్రాగన్..

భారత సరిహద్దుకు సమీపంలోని హోటన్, గర్ గున్సా వైమానిక స్థావరాల్లో సుఖోయ్ సహా యుద్ధవిమానాలు, బాంబర్లు, గగనతల రక్షక వ్యవస్థలను మోహరిస్తోంది చైనా.

శాంతి ప్రకటనలతో బుకాయింపులు..

ఇదిలా ఉండగా సరిహద్దు వెంట శాంతిని కాపాడాలని బుకాయిస్తోంది చైనా. భారత్- చైనా పరస్పరం ప్రాముఖ్య పొరుగుదేశాలని.. ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకునేందుకు సరిహద్దు వెంట ప్రశాంతతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. సరిహద్దు వెంట ఉద్రిక్తతలను తగ్గించేందుకు సోమవారం భారత రక్షణ మంత్రుల మధ్య సంభాషణ జరిగిందని ప్రకటించింది చైనా రక్షణ శాఖ.

అయితే జూన్ 15 నాటి ఘర్షణలకు భారతే బాధ్యత వహించాలని పేర్కొంటూ తమ విదేశాంగ, రక్షణ శాఖలతో వేర్వేరు ప్రకటనలు విడుదల చేయించడం ద్వారా తమ వక్రబుద్ధిని చాటుకుంది చైనా.

ఇదీ చూడండి: భారత్​-చైనా మధ్య దౌత్యస్థాయి చర్చలు

తూర్పు లద్దాఖ్​కు​ ఆర్మీ చీఫ్​- 'సన్నద్ధత'పై సమీక్ష

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.