భారత ఆర్మీ చీఫ్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత... తొలి పర్యటనకు సియాచిన్ వెళ్లారు ముకుంద్ నరవాణే. సియాచిన్ యుద్ధస్మారకం వద్ద అమరజవాన్లకు నివాళులు అర్పించారు. అనంతరం భారత సైనికులతో కాసేపు ముచ్చటించారు ఆర్మీ జనరల్. వారితో కలిసి అల్పాహారం సేవించారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్బిర్సింగ్ కూడా సైన్యాధిపతి వెంటే ఉన్నారు.
గతేడాది డిసెంబర్ 31న భారత 28వ సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు నరవాణే.
భారత్‌లోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ పర్యటన పట్ల ఆనందం వ్యక్తం చేశారు నరవాణే. ఇక్కడ విధులు నిర్వర్తించడం కష్టసాధ్యమని అన్నారు.
''ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. ప్రతికూల వాతావరణంలో బాధ్యతలు నిర్వర్తించడం కష్టతరం. వారికి అవసరమైన సదుపాయాలన్నీ అందించేందుకు కృషి చేస్తాం. నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇక్కడికి రావాలనుకున్నా. కానీ జనవరి మొదటి వారంలో వాతావరణం అనుకూలించలేదు. ''
- ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే